Lady teacher: దేవుడు ఆదేశించాడని కన్న కొడుకును చంపిన తల్లి, సేమ్ మదనపల్లె సీన్ రిపీట్ !

కొచ్చి/పాలక్కాడ్/ మదనపల్లె: దేవుడ ఆదేశించాడని, అల్లాను మెప్పించి అనుగ్రహం పొందాలని అతిగా ఆలోచించిన కన్న తల్లి కన్న కొడుకుని అతి కిరాతకంగా చంపేసింది. దేవుడు చెప్పాడని ఆవేశంతో ఊగిపోయి కన్న కొడుకును చంపేసి చేసిన తప్పును ఆమె స్వయంగా పోలీసలకు చెప్పి ఇప్పుడు కటకటాపాలైయ్యింది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో కన్న కూతుర్లును అతి కిరాతకంగా చంపేసిన తల్లిదండ్రుల కథ జరిగిన కొన్ని రోజులకే సేమ్ సీన్ రిపీట్ కావడంతో సామాన్య ప్రజలు ఉలిక్కిపడ్డారు. కన్న కొడుకును చంపింది లేడీ టీచర్ అని వెలుగు చూడటంతో కలకలం రేపింది.

 మదరసా లేడీ టీచర్

మదరసా లేడీ టీచర్

కేరళలోని పాలక్కాడ్ లోని పుత్తుపల్లి రోడ్డులో సులేమాన్, షాహినా (30) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. సులేమాన్, షాహీనా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సేలేమాన్, షాహినా దంపతుల ముగ్గురు పిల్లల్లో అదిల్ (6) అనే కొడుకు చివరివాడు. షాహీనా చాలా కాలం నుంచి పాలక్కాడ్ లోని ఓ ప్రముఖ మదరసాలో టీచర్ గా ఉద్యోగం చేస్తోంది.

 గర్బవతి..... విపరీతమైన దైవభక్తి

గర్బవతి..... విపరీతమైన దైవభక్తి

షాహీనా ప్రస్తుతం గర్బవతి. సులైమాన్ ట్యాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. షాహీనాకు దైవభక్తి చాలా ఎక్కువ. దానికితోడు మదరసాలో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న షాహీనా నిత్యం అక్కడ చదువుకునే పిల్లలకు దేవుడి గురించి, దేవుడి మహిమల గురించి భోదిస్తోంది. నిత్యం షాహీనా అతిగా దైవభక్తితో ఊగిపోయేదని తెలిసింది.

 నిద్రపోతున్న కొడుకు హత్యకు స్కెచ్

నిద్రపోతున్న కొడుకు హత్యకు స్కెచ్

రాత్రి భోజనం చేసిన తరువాత సులైమాన్ ఇద్దరు పిల్లలతో కలిసి ఓ గదిలో నిద్రపోయాడు. లేడీ టీచర్ షాహీనా, ఆమె చిన్న కొడుకు అదిల్ మరో గదిలో నిద్రపోయారు. వేకువ జామున నాలుగు గంటల సమయంలో షాహీనా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం కన్న కొడుకు అదిల్ ను నిద్రలేపి బాత్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లింది.

 గొంతు చీల్చి చంపేసింది

గొంతు చీల్చి చంపేసింది

దేవుడు ఆదేశించాడని, తాను కచ్చితంగా ఆ పని చెయ్యాలని ఊహించుకున్న షాహీనా కొడుకు అదిల్ ను బాత్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లిన తరువాత అతని కాళ్లు చేతులు కట్టేసి పదునైన కత్తి తీసుకుని అతని గొంతు చీల్చేసి అతి దారుణంగా చంపేసింది. కొడుకును దారుణంగా చంపేసిన షాహీనా ఈ లోకంలోకి వచ్చి తాను తప్పు చేశానని తెలుసుకుని స్వయంగా స్థానిక పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది.

 హడలిపోయిన కేరళ

హడలిపోయిన కేరళ

విషయం తెలుసుకున్న పాలక్కాడ్ లోని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చే వరకు అదిల్ ను షాహీనా హత్య చేసిందని పక్క గదిలో నిద్రపోతున్న ఆమె భర్త సులైమాన్ కు తెలీకపోవడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న స్థానికులు సులైమాన్ బంధువులు, స్నేహితులు గుమికూడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. విపరీతమైన దైవభక్తి ఉన్న షాహీనా పరధ్యానంతో కన్న కొడుకు అదిల్ ను దారుణంగా హత్య చెయ్యడం కేరళలో దూమరం రేపింది.

 నిన్న మదనపల్లె.... నేడు పాలక్కాడ్

నిన్న మదనపల్లె.... నేడు పాలక్కాడ్

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో దేవుడు ఆదేశించాడని ఎదిగిన ఇద్దరు కుమార్తెలను కన్న తల్లిదండ్రులు పురుషోత్తమ నాయుడు, పద్మజ దంపతులు దారుణంగా హత్య చెయ్యడం దేశంలోనే కలకలం రేపింది. హత్యకు గురైన ఇద్దరు యువతుల తల్లిదండ్రులు పురుషోత్తమ నాయుడు, పద్మజ ఉన్నత విధ్యావంతులు కావడంతో దేశ ప్రజలు హడలిపోయారు. ఇప్పుడు అలాంటి విద్యావంతురాలైన మరో లేడీ టీచర్ చేతిలో అదే పరిస్థితిలో కన్న కొడుకు హత్యకు గురి కావడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+