Lady: మహిళ జీవితంతో ఫుట్ బాల్ ఆడుకున్న ఎస్ఐ, మార్ఫింగ్ ఫోటోలతో ఏం చేశాడంటే ?, క్లైమాక్స్ షాక్ !

చెన్నై/కోల్ కత్తా: ఓ మహిళకు ఓ పార్టీలో పోలీసు అధికారి పరిచయం అయ్యాడు. కొంతకాలం ఇద్దరూ టచ్ లో ఉన్నారు. తరువాత మహిళ తల్లి చనిపోవడంతో ఆమె డిప్రేషన్ లోకి వెళ్లింది. ఆ సందర్బంలో మహిళను ఓదార్చే ముసుగులో ఆ పోలీసు అధికారి ఆమెకు దగ్గర అయ్యాడు. తనకు పెళ్లికాలేదని ఆమెను నమ్మించాడు. తరువాత మహిళను అతను శారీరకంగా లొంగదీసుకోవాలని ప్రయత్నించి చివరికి అత్యాచారం చేశాడు. మహిళ కేసు పెట్టడంతో ఆమెను చంపేస్తానని ఆమె కారు లాక్కొని వెళ్లాడు. మహిళను వివిద రూపాల్లో టార్చర్ పెట్టాడు. మహిళ పోలీసు అధికారులకు ఫిర్యాదు చెయ్యడంతో ఆ పోలీసు అధికారి రాష్ట్రాలు దాటుకుని పారిపోయాడు. క్లైమాక్స్ లో సార్ రూపురేఖలు చూసిన సాటి పోలీసు అధికారులు హడలిపోయారు.

పార్టీలో ఎస్ఐ పరిచయం

పార్టీలో ఎస్ఐ పరిచయం

చెన్నై సిటీలోని కోవిలంబాక్కంకు నివాసం ఉంటున్న 37 ఏళ్ల మహిళకు మూడు సంవత్సరాల క్రితం ఓ పార్టీలో సెయింట్ తో మైయార్‌మలై పోలీస్ డిస్ట్రిక్ట్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో స్పెషల్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆండ్రూస్ కార్ట్‌వెల్‌ అలియాస్ అండ్రూస్ కలిశాడు. తాను పోలీసు అధికారి అని తనకు మంచి పలుకుబడి ఉందని ఆండ్రూస్ ఆ మహిళకు చెప్పాడు.

 మహిళ మీద అత్యాచారం చేసిన ఎస్ఐ

మహిళ మీద అత్యాచారం చేసిన ఎస్ఐ


కొంతకాలం ఎస్ఐ ఆండ్రూస్, ఆ మహిళ ఇద్దరూ టచ్ లో ఉన్నారు. తరువాత మహిళ తల్లి చనిపోవడంతో ఆమె డిప్రేషన్ లోకి వెళ్లింది. ఆ సందర్బంలో మహిళను ఓదార్చే ముసుగులో ఎస్ఐ ఆండ్రూస్ తరచూ ఆమె ఇంటికి వెళ్లి ఆమెకు దగ్గర అయ్యాడు. తనకు పెళ్లికాలేదని ఆమెను నమ్మించిన ఎస్ఐ ఆండ్రూస్ ఆమెను శారీరకంగా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. చివరికి మహిళ మీద ఎస్ఐ ఆండ్రూస్ అత్యాచారం చేశాడు.

 ఎస్ఐ మీద కేసు పెట్టిన మహిళ

ఎస్ఐ మీద కేసు పెట్టిన మహిళ

తాను అవివాహితుడు అని, యువకుడిలా నటించి తనను మోసం చేసి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఎస్ఐ ఆండ్రూస్ మీద చెన్నైలోని పల్లికరణ్ పోలీస్ స్టేషన్‌లో 2020 లో కేసు పెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ ఆండ్రూస్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన పల్లికరణ పోలీసులు తదుపరి విచారణకు హాజరుకావాలని కోరినట్లు సమాచారం.

మహిళ మార్ఫింగ్ ఫోటోలు వైరల్

మహిళ మార్ఫింగ్ ఫోటోలు వైరల్

పోలీసు విచారణకు హాజరుకాకుండా పరారైన ఆండ్రూస్ తన మీద కేసు పెట్టిన మహిళ మీద రగిలిపోయాడు. కేసు పెట్టిన మహిళ ఫోటోలు మార్ఫింగ్ చేసి వాటిని అశ్లీల ఫోటోలుగా మార్చేసిన ఎస్ఐ ఆండ్రూస్ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో అవి వైరల్ అయ్యాయి. బాధితురాలి కారు లాక్కెళ్లి కేసు వెనక్కి తీసుకోకపోతే నిన్ను చంపేస్తానని బెదిరించాడని, తనను హత్య చెయ్యడానికి ప్రయత్నించారని మరో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆండ్రూస్ మీద మరో కేసు నమోదైంది.

కోల్ కత్తాలో మకాం

కోల్ కత్తాలో మకాం

మహిళ మరో కేసు పెట్టడంతో ఎస్ఐ ఆండ్రూస్ లాంగ్ లీవ్ పెట్టి పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయాడు. ఆండ్రూస్ ను అరెస్టు చేసి తనకు న్యాయం చెయ్యాలని, తనను చంపేస్తానని ఆండ్రూస్ బెదిరిస్తున్నాడని బాధితురాలు చెన్నైలోని తాంబరం పోలీస్‌ కమిషనర్‌ అమల్‌ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఆండ్రూస్ ను పట్టుకోవడానికి పోలీసు కమీనర్ అమల్ రాజ్ స్పెషల్ పోలీసు ఫోర్స్ ఏర్పాటు చేశారు.

పశ్చిమ బెంగాల్ లో అరెస్టు....... సార్ గెటప్ తో షాక్

పశ్చిమ బెంగాల్ లో అరెస్టు....... సార్ గెటప్ తో షాక్


చెన్నై పోలీసులు పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో తలదాచుకున్న ఆండ్రూస్ ను స్పెషల్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోల్‌కతా నుంచి పల్లికరణ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఆండ్రూస్ ఎక్కువగా గడ్డం, మీసాలు, జుట్టు పెంచుకోవడంతో అతని గెటప్ చూసిన చెన్నై పోలీసులు షాక్ అయ్యారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+