Lady: వదిన VS మరిది, భార్యకు ముందు నుంచి డౌట్, పిల్లల గొడవ, మామిడి కాయ తొక్కతో, షాక్ ?
చండీఘడ్/ హర్యానా/ చెన్నై: పక్కపక్క ఇళ్లలో అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. అన్నాతమ్ముడు ఇద్దరికీ వివాహం జరిగింది. అన్న భార్యతో తన భర్త చనువుగా ఉంటున్నాడని తమ్ముడి భార్యకు అనుమానం పెరిగింది. లేనిపోని విషయాలు చెప్పి అన్నాతమ్ముడికి గొడవలు పెట్టడమే కాకుండా తోడికోడళ్లు రాయిటెంకాయి లాగా మారిపోయారు. అన్న భార్యతో గొడవ పడిన మరిది పదునైనా గడ్డపార తీసుకుని దాడి చెయ్యడంతో వదిన ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది.

సొంత సోదరులు
హర్యానాలోని అంబాలా నగరంలోని అజయ్ అంబాలా కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేహా కాలనీలో అనీల్, ధీరజ్ అలియాస్ వతి సోదరులు నివాసం ఉంటున్నారు. అనీల్ కు స్వప్నా (30) అనే యువతితో వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ధీరజ్ కు సుమన అనే యువతితో వివాహం అయ్యింది. ధీరజ్, సుమన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వదినతో చనువుగా ఉన్నాడని డౌట్ ?
అనీల్, ధీరజ్ సోదరులు విడిపోయి పక్కపక్క ఇళ్లలోనే వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. అన్న అనీల్ భార్య స్వప్నాతో తన భర్త ధీరజ్ చనువుగా ఉంటున్నాడని అతని భార్య సుమనకు అనుమానం ఎక్కువ అయ్యింది. కావాలనే సుమన అన్నదమ్ములు అనీల్ ,ధీరజ్ కు గొడవలు పెట్టడం మొదలుపెట్టిందని ఆరోపణలు ఉన్నాయి,

పిల్లలు చేసిన పనికి గొడవ
అన్నదమ్ముల గొడవలతో తోడుకోడళ్లు స్వప్నా, సుమన ఒకరిని చూస్తే ఒకరు మండిపడుతూ రాయిటెంకాయి లాగా తయారైనారు. ధీరజ్, సుమన పిల్లలు వాళ్ల ఇంట్లో మామడి కాయలు తీసి వాటి ముట్టలు, తొక్కలు తీసుకెళ్లి అనీల్ ఇంటి ముందు వేశారు. మీ ఇంట్లో మామడి కాయలు తిని మా ఇంటి ముందు ఎందుకు వేశారు అని స్వప్నా వెళ్లి ప్రశ్నించింది.

జుట్లు పట్టకున్న తోడుకోడళ్లు
ఆ సమయంలో తోడుకోడళ్లు స్వప్నా, సుమన తగులుకుని ఒకరిజుట్లు ఒకరు పట్టుకుని ముష్టి యుద్దం చేశారు. గొడవ తారాస్థాయికి చేరడంతో నా భార్య మీద దాడి చేస్తావా ? అంటూ మరిది ధీరజ్ పదునైన గడ్డపార తీసుకెళ్లి వదిన స్వప్నా తల మీద దాడి చెయ్యడంతో తీవ్రగాయాలై ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే స్వప్నాను ఆమె భర్త అనీల్ కంటోన్మెట్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే స్వప్నా మరణించిందని వైద్యులు చెప్పారు.

నా తమ్ముడు, మరదలు నా భార్యను చంపేశారు
తన భార్య స్వప్నాను తన సోదరుడు ధీరజ్, అతని భార్య సుమన చంపేశారని భర్త అనీల్ కేసు పెట్టాడని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. హత్య కేసు నమోదు చేసి కేసు విచారణ చేస్తున్నామని, ఇంత వరకు ఎవ్వరినీ అరెస్టు చెయ్యలేదని అజయ్ అంబాల కంటోన్మెంట్ పోలీసులు స్థానిక మీడియాకు చెప్పారు. సొంత మరిది చేతిలో వదిన హత్యకు గురి కావడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications