దుమ్ములేపేసిన ఐటీ హబ్ ప్రజలు, మెట్రో రైళ్లు గడగడ, కూసాలు కదిలిపోయాయి !
దేశవ్యాప్తంగా కొన్నేళ్లుగా మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఒక్కరోజులోనే లక్షలాది మంది మెట్రోలో ప్రయాణించారు. నిన్న ఒక్కరోజే అంటే డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి బెంగళూరు మెట్రో రైలులో 6,26,202 మంది ప్రయాణించారు. కొత్త సంవత్సరం నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున 2.15 గంటల వరకు అధిక సంఖ్యలో ప్రజలు నమ్మ బెంగళూరు మెట్రో రైలు సేవలను సద్వినియోగం చేసుకున్నారు.
బెంగళూరులోని ఎంజీ రోడ్ మెట్రో మార్గంలో ఎక్కువ మంది ప్రయాణించారు. ఇందిరానగర్‌తోపాటు బెంగళూరు నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలలో ప్రజలు సంచరించారు. బెంగళూరు నగరం నడిబొడ్డున ఉన్న మెజెస్టిక్ నుంచి ఎక్కువ మంది అన్ని వైపులా ప్రయాణిస్తుంటారు. న్యూ ఇయర్ సందర్బంగా నమ్మ బెంగళఊరు మెట్రో రైలు టైమింగ్స్ పొడిగింంచారు. ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చర్చి స్ట్రీట్, బెంగళూరులోని మెజస్టిక్ తో సహా అనేక ప్రదేశాలలో నూతన పంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి ప్రజలు డిసెంబర్ 31 రాత్రి ప్రయాణించారు.

కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఈ ప్రాంతాల్లో వేలాది మంది యువతి, యువకులు గుమిగూడారు. దీంతో ఈ రూట్లలో నమ్మ బెంగళూరు మెట్రో సర్వీసులతో పాటు అదనపు బీఎంటీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31వ తేదీ రాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సర్వీసును పొడిగించారు.

బెంగుళూరు వాసులు ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు మ్యూజికల్ పోగ్రామ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, విందులు, వినోదాలుతో పాటు పలు కార్యక్రమాతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకోవడానికి పలు ప్రాంతాల్లో కలిశారు. కొత్త సంవత్సర వేడుకలకు బెంగళూరు కేంద్ర బిందువుగా ఉన్న ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులో ఆదివారం ఉదయం నుంచి జనంతో కిక్కిరిసిపోయింది. లక్షల మందితో రద్దీగా ఉండే ఈ రెండు వీధులు మిరుమిట్లు గొలిపే లైట్లతో లక్షలాది మందిని ఆకర్షించాయి.
సాయంత్రానికి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు మొదలవడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఈ రోడ్లపై జనం అరుస్తున్నారు. ఇది కాకుండా అనేక ముఖ్యమైన వాణిజ్య కేంద్ర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో కళ్లు జిగేల్ అనేలా అలంకరించారు. ఈ నేపథ్యంలో సెన్సిటివ్ ఏరియా, వేడుకలు జరుగుతున్న రోడ్ల వద్ద మరింత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విలాసవంతమైన హోటళ్లు, పబ్బులు సిలికాన్ సిటీ ప్రజల కోసం అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు.
బెంగళూరు నగరంలో ఎక్కువగా గుమిగూడే ఇందిరా నగర్, కోరమంగళ, ఎలక్ట్రానిక్ సిటీ, వైట్‌ఫీల్డ్‌లోని పబ్‌లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, మాల్స్‌ను అలంకరించి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. దీంతో పాటు 2023 సంవత్సరం చివరి రోజు ఆదివారం రావడంతో వివిధ పబ్‌లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, మాల్స్‌లో డిన్నర్ పార్టీలు, డీజే మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. పార్టీలకు హాజరయ్యే కస్టమర్లకు డజన్ల కొద్దీ పబ్‌లలో రాయితీలు ప్రకటించారు.

డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మినహా అన్ని ఫ్లై ఓవర్లపై వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య ఊహించని విధంగా విపరీతంగా పెరిగింది. దీంతోపాటు ట్రాఫిక్ పోలీసులు సోమవారం ఉదయం 7 గంటల వరకు 48 చోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. వీలింగ్, డ్రాగ్ రేస్ కార్యకలాపాలను అరికట్టేందుకు బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలుగా గస్తీ తిరిగారు.
-
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications