యాదవులను అవమానించేలా లాలూ వ్యాఖ్యలు: మోడీ

పాట్నా: ప్రధాని నరేంద్రమోడీ గురువారం బీహార్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంగెర్ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ "నన్ను చూసేందుకు, నేను చెప్పే మాటలు వినేందుకు పొద్దుపొద్దున్నే ఇన్ని వేల మంది వచ్చారు. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ జన ప్రవాహాన్ని చూస్తుంటే, రేపు జరిగే ఎన్నికల్లో ఎటువంటి తీర్పు వస్తుందన్న విషయాన్ని నేను ఊహించగలుగుతున్నా. బీహార్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది. మీరు ఓట్లు వేయండి. ఆ మార్పును నేను చూపిస్తానని హామీ ఇస్తున్నా" అని అన్నారు.

Lalu Prasad insulted Yadavs by beef remarks: Modi in Bihar rally

అలా మాట్లాడి లాలూ బీహర్ ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. పశుమాంసాన్ని హిందువులు కూడా తింటున్నారంటూ ఆర్జేడీ అధినేత లాలూ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. లాలూ తన వ్యాఖ్యలతో, పశువుల పోషణే కుల వృత్తిగాగల తన సొంత కులస్థులను, ఆయన సొంత రాష్ట్రాన్ని అవమానించారని మండిపడ్డారు.

ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయి కానీ, లాలూజీ యాదవ కులస్తుల అధికారంలోకి వల్లే వచ్చారనే విషయాన్ని గ్రహించాలన్నారు. యదువంశీయులే మన దేశానికి పాలవిప్లవాన్ని చూపించారని గుర్తుచేశారు. యువతరం లాలూ వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పగా ఆ సమయంలో సైతాన్‌ తనని పూనిందని సమాధానమిచ్చారని, సైతాన్‌ లాలూనే ఎందుకు ఎంచుకుందని మోడీ ప్రశ్నించారు.

ఇది ఇలా ఉంటే ఈరోజు ప్రధాని మోడీ మొత్తం నాలుగు ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి సమీపంలోని ఓ గ్రామంలో మహమ్మద్ అక్లఖ్ అనే 52 ఏళ్ల వ్యక్తిని పశుమాంసం తిన్నాడనే అనుమానంతో గ్రామస్థులు కొట్టి చంపిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా లాలూ స్పందించారు.

హిందువులు పశుమాంసం తినడం లేదా అంటూ ప్రశ్నించారు. విదేశాల్లోని ప్రజలు పశుమాంసం తింటున్నప్పుడు అందులో తప్పేముందన్నారు. దీనిపై ఈరోజు ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిహార్‌లోని నవాడాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రధాని మోడీ దాద్రి ఘటనను పరోక్షంగా తన ప్రసంగంలో ప్రస్తావించారు.

భారత దేశంలో కీలక అంశాలైన వైవిధ్యం, సహనాన్ని ప్రజలంతా అర్థంచేసుకొని సఖ్యతగా ఉండాలని బుధవారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చెప్పిన వ్యాఖ్యలను ప్రజలంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. హిందువులు, ముస్లింలు ఒకరిపై ఒకరు పోట్లాడుకోవాలా, అందరూ పేదరికంపై పోరాడాలా, అనే అంశంపై ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు.

అంతా కలిసికట్టుగా పేదరికంపై పోరాడాలని సూచించారు. ఒక సంఘటనను రాజకీయం చేయడాన్ని తాము సహించబోమన్నారు. కొంత మంది రాజకీయాల కోసం, చిన్న చిన్న లాభాల కోసం బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ప్రజలు వాటిని పట్టించుకోవద్దని అన్నారు.

ఐదు దశల్లో బీహర్ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ అభివృద్ధే ధ్యేయంగా బీహార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. బీజేపీని ఎలాగైనా సరే ఓడించాలనే ఉద్దేశ్యంతో మరోవైపు అర్జేడీ, కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్) కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+