2020లో ఆర్జేడీ సీఎం అభ్యర్థిగా తేజస్వియాదవ్‌: లాలూ

Posted By:
Subscribe to Oneindia Telugu

పాట్నా:2020లో బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు తేజస్వి యాదవ్‌ ఆర్‌జేడీ సీఎం అభ్యర్థిగా పార్టీని ముందుండి నడిపిస్తారని ఆ పార్టీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ శుక్రవారం ప్రకటించారు

.తేజస్వి నాయకత్వంలో ఆర్‌జేడీ 2020లో జరిగే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని లాలూ స్పష్టం చేశారు. పార్టీ సీనియర్‌ నేతలు అబ్ధుల్‌ బరి సిద్ధిఖి, రఘవంశ్‌ ప్రసాద్‌ సింగ్‌లతో భేటీ అనంతరం లాలూ ఈ ప్రకటన చేశారు.

Lalu Prasad names Tejashwi as RJD's next CM candidate

తేజస్వి పార్టీకి అందిస్తున్నసేవలను ఈ సందర్భంగా లాలూ ప్రశంసించారు. ఈనెల 9న 28వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తేజస్వి ప్రస్తుతం బీహార్‌ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు.అయితే తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై పార్టీలో స్పష్టత రాలేదని కొందరు నేతలంటున్నారు.

అంతకుముందు ఆర్‌జేడీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌ చందర్‌ పుర్వే బీహార్‌ తదుపరి సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ పేరును ప్రతిపాదిస్తే సిద్ధికీ, సింగ్‌లు పుర్వే అభిప్రాయంతో విభేదించారనే వార్తలు వస్తున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ending speculation, RJD chief Lalu Prasad on Friday said his son Tejashwi Yadav will lead the party in the next Bihar Assembly polls. He will also be the Rashtriya Janata Dal's Chief Ministerial candidate

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి