వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ కుట్రలో భాగమే సిబిఐ దాడులు: లాలూ

ఆర్‌జెడి చీఫ్, మాజీ కేంద్ర రైల్వేశాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిపై సిబిఐ దాడులు నిర్వహించింది.అయితే సిబిఐ దాడులు బిజెపి రాజకీయ కుట్రలో భాగమమన్నారు లాలూ ప్రస

By Narsimha
|
Google Oneindia TeluguNews

పాట్నా: ఆర్‌జెడి చీఫ్, మాజీ కేంద్ర రైల్వేశాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిపై సిబిఐ దాడులు నిర్వహించింది. అంతేకాదు ఆయనపై కేసులను కూడ నమోదుచేసింది.అయితే సిబిఐ దాడులు బిజెపి రాజకీయ కుట్రలో భాగమమన్నారు లాలూ ప్రసాద్ యాదవ్.

లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుండి 2009 మధ్య కాలంలో రైల్వే మంత్రిగా ఆయన పనిచేశారు. ఓ ప్రైవేట్ హోటల్ కంపెనీకి ఆయన అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో సిబిఐ కేసు దాఖలుచేసింది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ ద్వారా అ అవినీతి కార్యకలాపాలు జరిగినట్టు ఆరోపించింది.

Lalu Yadav to appear before CBI court in fodder scam case, says 'will speak on CBI raids later today

ఈ కేసులో లాలూ సతీమణి రబ్రీదేవి, ఆయన కుమారుడు తేజస్వి, ఐఆర్‌సీటీసీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ సీకె గోయల్ , లాలూ సహచరుడు ప్రేమ్‌చంద్ గుప్తా, ఆయన సతీమణి సరళగుప్తా ఉన్నారు. నిందితులకు సంబంధించిన 12 ప్రదేశాలపై సిబిఐ శుక్రవారం నాడు 12 చోట్ల దాడులు నిర్వహించింది. న్యూఢిల్లీ, గురుగ్రామ్, పాట్నా, రాంచీ, పూరీలలో ఈ దాడులు జరిగాయి.

అయితే సిబిఐ దాడుల గురించి లాలూ ప్రసాద్ మాట్లాడేందుకు నిరాకరించారు. దాణా స్కాం కేసులో లాలూ ఇవాళ సిబిఐ కోర్టుకు హజరయ్యారు. అయితే ఈ దాడులపై ఆయన స్పందించారు. ఆ కేసులో తన తప్పేమీ లేదన్నారు. అంతా పద్దతి ప్రకారంగానే జరిగిందన్నారు. బిజెపి కనుసన్నల్లోనే నడిచే సిబిఐ అంటూ ఆయన దుయ్యబట్టారు. ఈ విషయమై ఆయన కోర్టులో సవాల్ చేస్తానని ప్రకటించారు.

English summary
Rashtriya Janata Dal (RJD) chief Lalu Prasad Yadav on Friday refused to comment on the CBI raids at the premises of his family members in connection with a new case of alleged irregularities in awarding the tender for the maintenance of hotels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X