ఆస్ట్రేలియా ప్రధానికి మోడీ అరుదైన కానుక (పిక్చర్స్)

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యాటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ దేశ ప్రధాని టోనీ అబాట్‌కు ఓ అరుదైన కానుక అందించారు. కాన్‌బెర్రాలో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడానికి ముందు అబాట్‌కు మోడీ ఈ బహుమతిని ఇచ్చారు.

భారతదేశంలో స్థిరపడిన ఆస్ట్రేలియా ప్రముఖ న్యాయవాది జాన్ లాంగ్ 1854లో ఝాన్సీ లక్ష్మీబాయి తరపున ఈస్ట్ ఇండియా కంపెనీపై కోర్టులో వేసిన పిటిషన్ కాపీని మోడీ ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌కు కానుకగా ఇచ్చారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు.

భారత్‌లో జాన్ అద్భుత ప్రయాణాన్ని ప్రతిబింబించే మరో బహుమతిని కూడా మోడీ అబాట్‌కు అందించినట్లు అక్బరుద్దీన్ ఫొటోలతోపాటు ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన జాన్ లాంగ్ 1842లో భారత్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఆయన ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడారు. కంపెనీకి వ్యతిరేకంగా పత్రిక కూడా నడిపారు. ఆ తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయికి సలహాదారుగా పని చేశారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

మెల్‌బోర్న్‌లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. పరిశ్రమలకు ఏకగవాక్ష విధానంలో అనుమతులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

మోడీ కానుక

మోడీ కానుక

ఆస్ట్రేలియా పర్యాటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ దేశ ప్రధాని టోనీ అబాట్‌కు ఓ అరుదైన బహుమతి అందించారు.

మోడీ కానుక

మోడీ కానుక

కాన్‌బెర్రాలో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడానికి ముందు అబాట్‌కు మోడీ ఈ బహుమతిని ఇచ్చారు.

మోడీ కానుక

మోడీ కానుక

భారతదేశంలో స్థిరపడిన ఆస్ట్రేలియా ప్రముఖ న్యాయవాది జాన్ లాంగ్ 1854లో ఝాన్సీ లక్ష్మీబాయి తరపున ఈస్ట్ ఇండియా కంపెనీపై కోర్టులో వేసిన పిటిషన్ కాపీని మోడీ ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌కు కానుకగా ఇచ్చారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు.

పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రసంగించిన మోడీ

మెల్‌బోర్న్‌లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. పరిశ్రమలకు ఏకగవాక్ష విధానంలో అనుమతులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పారిశ్రామిక కారిడార్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.

పోర్టులను రోడ్లు, రైలు మార్గాలకు అనుసంధానం చేస్తామని వెల్లడించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో పోర్టులను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. దేశంలోని మొత్తం జనాభాలో 65శాతం మంది 35ఏళ్లలోపు వారేనని వివరించారు. హాలీవుడ్ సినిమా ఖర్చుకన్నా తక్కువ ఖర్చుతో మార్స్ ఆర్బిటరీ మిషన్ ప్రయోగించాయని చెప్పారు.

మామ్ ప్రయోగంతో యువతరం శక్తి ఏమిటో నిరూపితమైందని అన్నారు. నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేశామని, అన్ని రంగాల్లో నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని మోడీ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+