TCS Layoffs: లేఆఫ్ ఉద్యోగులకు టీసీఎస్ గుడ్ న్యూస్..! కీలక ప్రకటన..!

భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తాజాగా చేపట్టిన ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు 12 వేల మందికి పైగా ఉద్యోగుల్ని సాగనంపుతూ టీసీఎస్ తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో కలకలం రేపింది. టీసీఎస్ బాటలోనే పలు కంపెనీలు ఇప్పటికే ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. అదే సమయంలో ఈ భారీ నిర్ణయంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే పలు టీసీఎస్ కార్యాలయాల వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి.

ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల సమాఖ్య (యునైట్ ) ఆధ్వర్యంలో టీసీఎస్ కార్యాలయాల వద్ద ఉద్యోగాల కోతపై నిరసనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఇంత భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించి టీసీఎస్ వారి కుటుంబాలను రోడ్డున పడేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్ స్పందించింది. ఆటోమేషన్ కారణంగా చేపట్టిన ఈ లేఆఫ్ లకు దారి తీసిన పరిస్ధితుల్ని, అలాగే తొలగించిన ఉద్యోగుల పరిస్ధితిపై కీలక ప్రకటన చేసింది.

Layoffs Row TCS Assures Proper Benefits Assistance to Impacted Staff

టీసీఎస్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్ధ వెల్లడించింది. ఈ ప్రయాణంలో భాగంగా ఉద్యోగుల అవసరం లేని విభాగాల నుంచే వారిని తొలగించామని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 2 శాతం మందిని తొలగించామని, అదీ మిడిల్, సీనియర్ గ్రేడ్ల వారినే తీసేసినట్లు పేర్కొంది. తమ క్లయింట్లకు సర్వీస్ డెలివరీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఈ మార్పు అవసరమైనట్లు తెలిపింది.

Layoffs Row TCS Assures Proper Benefits Assistance to Impacted Staff

తమ చర్య కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన సహచరుల సవాళ్లను తాము అర్దం చేసుకోగలమని, అందుకే వారికి అందాల్సిన అన్ని ప్రయోజనాలు కల్పించడంతో పాటు ఇతర ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన సాయం చేస్తామని, ఇందుకు కౌన్సెలింగ్ కూడా అందిస్తామని టీసీఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే సదరు ఉద్యోగులకు నోటీసు పిరియడ్ కాంపెన్సేషన్, సీవెరెన్స్ ప్రయోజనం కూడా ఇస్తామని ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+