దర్శనాలు బంద్.. కేదార్‌నాథ్ క్లోజ్. మళ్లీ అక్షయ తృతీయకే

భక్తుల జయజయధ్వానాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య హిమాలయాల్లో వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ధామ్ శీతాకాల విరామం నిమిత్తం మూతపడింది. భాయి దూజ్ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం 8:30 గంటలకు ఆలయ తలుపులను శాస్త్రోక్తంగా మూసివేశారు. ఈ ఘట్టాన్ని కళ్లారా తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందేందుకు దేశ విదేశాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కేదార్‌నాథ్ ప్రాంగణం కిటకిటలాడింది. ఇకపై రాబోయే ఆరు నెలల పాటు కేదారీనాథుని పూజలన్నీ ఆయన శీతాకాల విడిది కేంద్రమైన ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలోనే ఘనంగా జరగనున్నాయి.

భాయి దూజ్ వేళ విశేష పూజలు.. శాస్త్రోక్తంగా ద్వారబంధనం

శీతాకాలంలో మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రతి ఏటా కేదార్‌నాథ్ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా బుధవారం వేకువజామునే ఆలయ ప్రధాన పూజారి గంగాధర లింగ మహారాజ్ సమక్షంలో భగవాన్ శంకరునికి మహా అభిషేకం, ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం నిర్ణీత ముహూర్తానికి ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేశారు. ఈ ఆధ్యాత్మిక ఘట్టం ముగిసిన వెంటనే బాబా కేదార్ నాథుని 'చల్ విగ్రహ ఉత్సవ డోలీ' ఊరేగింపుగా ఉఖీమఠ్ దిశగా బయలుదేరింది.

Thousands of Devotees Gather as Kedarnath Dham Closes Portals for Six Months Winter Hiatus Today
మంచు కొండల్లో మహాదేవుడి దర్శనం. ప్రధాని పిలుపు, కేదార్‌నాథ్ వెళ్దామా!
మంచు కొండల్లో మహాదేవుడి దర్శనం. ప్రధాని పిలుపు, కేదార్‌నాథ్ వెళ్దామా!

ఉఖీమఠ్‌లో శీతాకాల పూజలు.. కట్టుదిట్టమైన భద్రత

బాబా కేదార్ ఉత్సవ మూర్తి ఉఖీమఠ్‌కు చేరుకునే మార్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రుద్రప్రయాగ్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డోలీ ఊరేగింపు వెంట పోలీసు బలగాలతో పాటు ప్రత్యేక గార్డ్ ఆఫ్ ఆనర్ బృందాలను కూడా కేటాయించారు. కేదార్‌నాథ్ ఆలయం తిరిగి తెరుచుకునేంత వరకు క్షేత్ర రక్షణ కోసం స్థానిక పోలీసులతో పాటు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ప్లాటూన్‌ను అక్కడ విధుల్లో ఉంచుతున్నారు. శీతాకాలంలో ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ట్రాఫిక్, భద్రతాపరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు రుద్రప్రయాగ్ ఎస్పీ నిహారిక తోమర్ వెల్లడించారు.

కేదార్‌నాథ్ చెత్త దుస్థితి! పవిత్ర క్షేత్రం డమ్మింగ్ యార్డ్‌గా మారుతోందా?
కేదార్‌నాథ్ చెత్త దుస్థితి! పవిత్ర క్షేత్రం డమ్మింగ్ యార్డ్‌గా మారుతోందా?

మళ్లీ అక్షయ తృతీయకే దర్శనం

కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు మూతపడటంతో ఈ ఏడాది హిమాలయ యాత్ర అధికారికంగా ముగిసినట్లయింది. శీతాకాలం పూర్తయిన తర్వాత, వచ్చే ఏడాది మే నెలలో వచ్చే పవిత్ర అక్షయ తృతీయ సమయంలో తిరిగి ఆలయ తలుపులను తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఈ ఆరు నెలల పాటు భక్తులందరూ ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+