ఏపీ నుంచి బెంగళూరుకు వందేభారత్, రూట్ - తిరుపతి వందేభారత్ కు కొత్త స్టాపులు...!!
ఏపీ నుంచి బెంగళూరుకు వందేభారత్ పై బిగ్ అప్డేట్. గతంలోనే విజయవాడ - బెంగళూరు మధ్య వందేభారత్ ప్రతిపాదనల పైన చర్చ జరిగింది. కాగా.. విజయవాడ - చెన్నై మధ్య ప్రవేశ పెట్టాలని భావించిన వందేభారత్ తరువాత నర్సాపురం - చెన్నై మధ్య ప్రారంభమైంది. కాగా.. ఇప్పుడు ఏపీ నుంచి బెంగళూరుకు వెళ్లే వారి కోసం ఈ రైలు అందుబాటులోకి తేవటం పైన కీలక చర్చలు కొన సాగుతున్నాయి. అదే విధంగా ఏపీలో కొత్త రైల్వే కారిడార్ పైన ప్రతిపాదనలు అందాయి.
విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్ రైలు నడపాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి మూడు కీలక ప్రతిపాదనలు చేశారు. 'విజయవాడ నుంచి వేలాది మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు నిత్యం బెంగళూరుకు ప్రయాణిస్తుంటారని వివరించారు. విజయవాడ-బెంగళూరు మధ్య ప్రస్తుతం పరిమిత రవాణా సౌకర్యాలున్నాయని... దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాల మధ్య తక్షణమే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ప్రారంభించాలని కోరారు. అదే విధంగా పల్నాడు ప్రాంతంలోని సిమెంట్, సున్నపురాయి, వ్యవసాయ మరియు లాజిస్టిక్స్ రంగాలు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే పోర్టుతో అనుసంధానం ముఖ్యమని వివరించారు. అందుకే పిడుగురాళ్ల జంక్షన్ నుంచి రామాయ పట్నం పోర్టు వరకూ కొత్త రైల్వేలైన్ నిర్మించాలని కోరారు.

రైల్వే శాఖ తుది కసరత్తు
అదే విధంగా నడికుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్(20701), సికింద్రా బాద్-తిరుపతి, లింగంపల్లి-విజయవాడ ఎక్స్‌ప్రెస్(12796) రైళ్లకు స్టాపేజ్ ఇవ్వాలిని ఎంపీ విజ్ఞప్తి చేశారు. తాను చేసిన వినతుల పై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు. ఇక.. సికింద్రాబాద్ - గుంటూరు - నరసరావుపేట - కనిగిరి, విజయవాడ - గుంటూరు - కనిగిరి మార్గాల్లో డెము రైలు సర్వీసులను ప్రవేశపెట్టాలని కోరారు. దీనివల్ల విద్యార్థులు, ఉద్యోగు లతో పాటుగా రైతులు, వ్యాపారులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. ప్రస్తుతం ఏపీ మీదుగా బెంగళూరుకు నడుస్తున్న రైళ్లు నిత్యం రద్దీగా ఉంటున్నారు. కాచిగూడ - యశ్వంత్ పూర్ మధ్య నడుస్తున్న వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. వీకెండ్స్ లో బెంగళూరు మార్గంలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో.. త్వరలోనే బెంగళూరుకు వందేభారత్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications
