విశాఖ డీ నోటిఫై, కేంద్రం ఉత్తర్వులు - ఇక నుంచి ఆ సేవలన్నీ అక్కడే..!!

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు విశాఖ కేంద్రంగా అందుతున్న ఇమ్మిగ్రేషన్ సేవలను రద్దు చేసారు. ఈ సేవల నుంచి విశాఖను డీ నోటిఫై చేస్తూ ఉత్తర్వుల జారీ చేసారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా భోగాపురం నుంచి ఇక ఈ సేవలు కొనసాగనున్నాయి. ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, విదేశీ విమానాల సేవలు భోగాపురం నుంచి అమలు చేస్తూ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. దీంతో.. ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ సేవలు భోగాపురం నుంచే పొందాల్సి ఉంటుంది.

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవలను రద్దు చేశారు. విశాఖపట్నం విమానాశ్రయాన్ని 'అధికారిక ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్' ల జాబితా నుంచి మినహాయిస్తూ (డీనోటిఫై చేస్తూ) కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భోగాపురం విమానాశ్రయానికే అంతర్జాతీయ హోదా కల్పించింది. కొత్తగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా కేంద్రం గుర్తించడంతో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు ఇమ్మిగ్రేషన్ హోదాను రద్దు చేశామని ప్రకటించింది. ఇకపై విదేశీ విమానాల రాకపోకలు భోగాపురం నుంచే కొనసాగుతాయని తెలిపింది. అంతర్జాతీయ ప్రయాణికుల ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, విదేశీ విమానాల సేవలు ఇక భోగాపురం విమానాశ్రయంలోనే లభ్యమవుతాయని వివరించింది. పాత విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి వాణిజ్య విమాన సేవలు ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి పూర్తిగా నిలిచిపోయాయి.

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన - టికెట్లు జారీ ఇలా..!!
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన - టికెట్లు జారీ ఇలా..!!
visakhapatnam-airport-removed-from-official-immigration-checkpost-list-as-home-affairs-latest-decis

కేంద్రం నోటిఫికేషన్.. ఇక నుంచి భోగాపురం కేంద్రంగా

భోగాపురం ప్రారంభం వేళ అన్ని పౌర విమాన కార్యకలాపాలు కొత్తగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మారాయి. ఈ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ సేవలను రద్దు చేశారు. కాగా.. ఈ నిర్ణయంతో విశాఖ నగరం నుంచి భోగాపురం వెళ్లే ప్రయాణికుల కు అదనపు ప్రయాణ దూరం, సమయం పెరుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కొత్త విమానాశ్రయం అందించే మెరుగైన సౌకర్యాలు, అంతర్జాతీయ కనెక్టివిటీ తో ప్రాంతీయ అభివృద్ధికి ఊతం లభిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2026 జూలైలోనే కేంద్రం భోగాపురం విమానాశ్రయాన్ని ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా నోటిఫై చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అధికారిక ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌ల జాబితాలో కేటగిరీ-I కింద 39వ స్థానంలో చేర్చారు. ఏపీ‌లో విశాఖపట్నం, తిరుపతి తర్వాత భోగాపురం మూడవ ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా కొనసాగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+