హైదరాబాద్ కు మరో మణిహారం

హైదరాబాద్‌ లో చెరువుల పరిరక్షణ, పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. మాదాపూర్‌ శిల్పారామం సమీపంలో రూపురేఖలు మార్చుకున్న తమ్మిడికుంట చెరువు నేడు అందుబాటులోకి తీసుకుని రానుంది. ఈ సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. హైడ్రా పర్యవేక్షణలో ఈ చెరువు సమగ్ర పునర్నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసుకున్నాయి.

ఐటీ కారిడార్‌ గుండెకాయ లాంటి ప్రాంతంలో ఉన్న ఈ చెరువు అందుబాటులోకి రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించుకున్న గుడిసెలు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను కూడా ఈ సందర్భంగా అందజేస్తారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా రామాంతపూర్ పెద్ద చెరువు అభివృద్ధి సమయంలో నివాసాలు కోల్పోయిన 34 కుటుంబాలకు కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Restored Thammidikunta Lake in Madhapur Hyderabad set to inaugurate today following its redevelop

నగరంలో ఆక్రమణలకు గురైన చెరువుల పునరుద్ధరణ, పర్యావరణ సమతుల్యత కాపాడటంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆయన వివరించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొనబోతోండటం ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మితమైన విషయం తెలిసిందే. దీన్ని హైడ్రా కూల్చివేసింది. ఈ స్థలాన్ని ఆయన ప్రభుత్వానికి అప్పగించడంతో పాటు చెరువు పునర్నిర్మాణానికి తనవంతు సహాయ, సహకారాలను అందించారు. దీంతో ఈ కార్యక్రమానికి నాగార్జునను ముఖ్యఅతిథిగా ఆహ్వానించింది ప్రభుత్వం.

ఏపీతో కృష్ణా జలాలపై తేల్చనున్న సుప్రీంకోర్టు- రేవంత్ రెడ్డి రివ్యూ
ఏపీతో కృష్ణా జలాలపై తేల్చనున్న సుప్రీంకోర్టు- రేవంత్ రెడ్డి రివ్యూ

చెరువు పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఏకంగా 30,000 లకు పైగా ట్రక్కుల పూడిక, నిర్మాణ- బయోమెడికల్ వ్యర్థాలను తొలగించారు. దీంతో చెరువు విస్తీర్ణం 10 నుంచి ఏకంగా 26 ఎకరాలకు పెరిగింది. నీటి లోతు కూడా 0.6 మీటర్ల నుంచి 4.6 మీటర్లకు పెరిగింది. దీనివల్ల చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు రీఛార్జ్ అవ్వడానికి ఇది దోహదపడుతుంది.

హెచ్ 1బీ స్పాన్సర్‌షిప్‌ నిలిపివేసిన ఐబీఎం: అమెరికాను వీడటమో, రిజైన్ చేయడమో
హెచ్ 1బీ స్పాన్సర్‌షిప్‌ నిలిపివేసిన ఐబీఎం: అమెరికాను వీడటమో, రిజైన్ చేయడమో

స్థానికులు, ఐటీ ఉద్యోగులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు చెరువు చుట్టూ అనేక ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. సుమారు 1.6 కిలోమీటర్ల పొడవైన వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల కోసం ప్లే గ్రౌండ్, ల్యాండ్ స్కేప్, సందర్శకులు కూర్చోవడానికి అనుకూలమైన బెంచీలను సిద్ధం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువు చుట్టుపక్కల వేలాది మొక్కలను నాటారు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో నగరవాసులకు వాకింగ్, రీక్రియేషన్ సెంటర్ గా మారనుంది.

మాదాపూర్, హైటెక్ సిటీ వంటి బిజీ ఐటీ ప్రాంతాల్లో వర్షాకాలంలో తలెత్తే వరద ముప్పును తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం. భారీ వర్షాలు కురిసిన సమయంలో పరిసర ప్రాంతాల నుంచి వచ్చే నీరు సజావుగా చెరువులోకి చేరేలా ప్రత్యేక డ్రైనేజీ అనుసంధానించారు. చెరువు నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరగడం వల్ల చుట్టుపక్కల రహదారులపై నీరు నిలిచిపోయే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+