బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Leader: ఐటీ హబ్ లో మాజీ కార్పోరేటర్ ఆత్మహత్య, ఫామ్ లో ఉన్న పోలిటికల్ లీడర్, ఎమ్మెల్యే టిక్కెట్ కోసం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ లో మాజీ కార్పోరేటర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వచ్చే శాసన సభ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని ఇప్పటి నుంచి ఆశపడుతూ ఆ నియోజక వర్గంలో వివిద సమాజసేవా కార్యక్రమాలు చేస్తున్న పొలిటికల్ లీడర్ ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు హడలిపోయారు. ఆత్మహత్య చేసుకున్న పొలిటికల్ లీడర్ భార్య కూడా ఒక్కసారి కార్పోరేటర్ గా విజయం సాధించారు. మంచి పొలిటికల్ ఫామ్ లో ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన వర్గీయులు హడలిపోయారు. పోలిటికల్ లీడర్ ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూడటంతో ఆయన నివాసం ఉంటున్న ఏరియా ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Illegal affair: ఇడ్లీ స్కెచ్ తో భర్తను చంపేసిన లేడీ టీచర్, ప్రియుడితో గంటలు గంటలు ?, ఫినిష్ !Illegal affair: ఇడ్లీ స్కెచ్ తో భర్తను చంపేసిన లేడీ టీచర్, ప్రియుడితో గంటలు గంటలు ?, ఫినిష్ !

మాజీ కార్పోరేటర్

మాజీ కార్పోరేటర్


ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని అత్తిగుప్పేలో శివప్ప అలియాస్ శివన్న (55) అనే రాజకీయ నాయకుడు నివాసం ఉంటున్నారు. 2005లో అత్తిగుప్పే వార్డు కార్పోరేటర్ గా కాంగ్రెస్ టిక్కెట్ మీద విజయం సాధించిన శివప్ప ఐదు సంవత్సరాలు కార్పోరేటర్ గా స్థానిక ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అత్తిగుప్పే వార్డులో శివప్పకు ప్రత్యేకంగా ఓ వర్గం ఉంది.

 బీజేపీలో చేరిన శివన్న.... భార్య కూడా కార్పోరేటర్

బీజేపీలో చేరిన శివన్న.... భార్య కూడా కార్పోరేటర్

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన శివప్ప తరువాత బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన శివప్ప తరువాత బీడీఏ సభ్యుడిగా పని చేశారు. మాజీ కార్పోరేటర్ శివప్ప భార్య కూడా బీబీఎంపీ కార్పోరేటర్ గా విజయం సాధించారు. శివప్ప, ఆయన భార్య రెండుసార్లు కార్పోరేటర్లుగా విజయం సాధించడంతో ఆయనకు ఆ ప్రాంతంలో మంచి పేరు ఉంది.

 గాంధీనగర్ ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని !

గాంధీనగర్ ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని !


బెంగళూరులోని గాంధీనగర్ శాసన సభ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని శివప్ప ఆశపడుతున్నారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి పోటీ చెయ్యాలని, ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని ఇప్పటి నుంచి ఆశపడుతున్న మాజీ కార్పోరేటర్ శివప్ప ఆ నియోజక వర్గంలో వివిద సమాజసేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.

ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న పొలిటికల్ లీడర్

ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న పొలిటికల్ లీడర్

శివప్ప ప్రస్తుతం చంద్రాలేఔట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తిగుప్పేలోనే నివాసం ఉంటున్నాడు. గురువారం శివప్ప కుటుంబ సభ్యులు అందరూ బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శివప్ప ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శివప్ప కుమారుడు ఇంటికి వెళ్లి చూడగా మాజీ కార్పోరేటర్ ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది.

హడలిపోయిన నాయకులు..... స్థానికులు

హడలిపోయిన నాయకులు..... స్థానికులు

మంచి పొలిటికల్ ఫామ్ లో ఉన్న మాజీ కార్పోరేటర్ శివప్ప ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన వర్గీయులు హడలిపోయారు. పోలిటికల్ లీడర్ శివప్ప ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూడటంతో ఆయన నివాసం ఉంటున్న అత్తిగుప్పే ఏరియా ప్రజలు ఉలిక్కిపడ్డారు.

 శివన్నతో ఎవరెవరు మాట్లాడారు ?

శివన్నతో ఎవరెవరు మాట్లాడారు ?

శివప్ప ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని చంద్రాలేఔట్ పోలీసు అధికారులు అంటున్నారు. గురువారం కూడా స్థానికులు చాలా మంది మాజీ కార్పోరేటర్ శివప్పతో మాట్లాడారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రెండు మూడు రోజుల నుంచి మాజీ కార్పోరేటర్ శివప్పతో ఎవరెవరు మాట్లాడారు అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

Recommended Video

రైతులకు అన్యాయం జరిగితే సహించమన్న భట్టి విక్రమార్క || Oneindia Telugu
 పక్కా మ్యాటర్ తెలీదు

పక్కా మ్యాటర్ తెలీదు

విషయం తెలుసుకున్న బెంగళూరులోని చాలా మంది నాయకులు పార్టీలకు అతీతంగా శివప్ప ఇంటి దగ్గరకు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను ధైర్యం చెబుతున్నారు. రాజకీయ కారణాల వలన శివప్ప ఆత్మహత్య చేసుకున్నారా ?, లేక ఆయనకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయంలో మాత్రం పక్కాక్లారిటీ లేదని పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Leader: BBMP former Corporator and BJP leader commits suicide in Bengaluru City in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X