Leader: మహిళ మెడలో మంగళసూత్రం లాక్కెళ్లిన జాతీయ పార్టీ యూత్ లీడర్, పోయేకాలం వచ్చిందేమో !

చెన్నై/ కోయంబత్తూరు: ప్రముఖ జాతీయ పార్టీలో ఆ యువకుడు చాలా చురుకుగా పని చేస్తున్నాడు. అతని తెలివితేటలు, చురుకుదనం చూసిన ఆ పార్టీ నాయకులు అతన్ని యూత్ విభాగం సిటీ వైస్ ప్రెసిడెంట్ చేశారు. పార్టీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరౌతున్న ఆయువకుడు ఆ పార్టీ నేతల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సిటీలోని ఓ ఏరియాలో ఉంటున్న దంపతులు సొంతంగా కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. భర్త పనిమీద బయటకు వెళ్లిన సమయంలో అతని భార్య షాపు చూసుకుంటున్నది. షాపులో దగ్గరకు ఇద్దరు యువకులు బైక్ లో వెళ్లారు. ఓ యువకుడు ఆంటీ వెళ్లి సిగరెట్ ఇవ్వాలని చెప్పాడు. ఆమె సిగరెట్ తీసి ఆ యువకుడికి ఇచ్చింది. సిగరెట్ తో పాటు ఆమె మెడలో ఉన్న ఐదు తులాల మంగళసూత్రం లాక్కొని పరారైనాడు. బాధితురాలు దొంగ దొంగ అని గట్టిగా కేకలు వెయ్యడం, స్థానికులు ఆ బైక్ ను వెంబడించడం జరిగింది. అయితే మంగళసూత్రం లాక్కొని బైక్ లో వెళ్లిన ఇద్దరు పరారైనారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ ఆధారం దర్యాప్తు చేసిన పోలీసులు చైన్ స్నాచింగ్ చేసిన వారిని పట్టుకుని విచారణ చెయ్యడంతో అందరూ బిత్తరపోయారు.

 దంపతుల కిరాణ దుకాణం

దంపతుల కిరాణ దుకాణం

తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలోని కునియముత్తూరులోని సెల్వకుమార్, ధనలక్ష్మి (55) దంపతులు నివాసం ఉంటున్నారు. సెల్వకుమార్, ధనలక్ష్మి దంపతులు కేజీకే రోడ్డు ఏరియాలో సొంతంగా కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. భర్త సెల్వకుమార్ పనిమీద బయటకు వెళ్లిన సమయంలో అతని భార్య ధనలక్ష్మి కిరాణా షాపు చూసుకుంటున్నది.

 యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్

యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్

కోయంబత్తూరులో కాంగ్రెస్ పార్టీ విభాగంలో రాజేష్ అనే యువకుడు చాలా చురుకుగా పని చేస్తున్నాడు. రాజేష్ తెలివితేటలు, చురుకుదనం చూసిన ఆ పార్టీ నాయకులు రాజేష్ ను కోంబత్తూరు సిటీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చేశారు. పార్టీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరౌతున్న రాజేష్ ఆ పార్టీ నేతల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 ధనలక్ష్మి మెడలో 5 తులాల మంగళసూత్రం

ధనలక్ష్మి మెడలో 5 తులాల మంగళసూత్రం

భర్త సెల్వకుమార్ పనిమీద బయటకు వెళ్లిన సమయంలో అతని భార్య ధనలక్ష్మి షాపులో ఉంది. ధనలక్ష్మి షాపులో దగ్గరకు కాంగ్రెస్ పార్టీ లీడర్ రాజేష్ తో పాటు మరో యువకుడు బైక్ లో వెళ్లారు. ఆ సమయంలో ఓ యువకుడు ధనలక్ష్మి షాపులోకి వెళ్లి ఆంటీ సిగరెట్ ఇవ్వాలని చెప్పాడు. ధనలక్ష్మి సిగరెట్ తీసి ఆ యువకుడికి ఇచ్చింది. సిగరెట్ తో పాటు ఆమె మెడలో ఉన్న ఐదు తులాల మంగళసూత్రం లాక్కొని ఆ యువకుడు సమీపంలో బైక్ మీద రెడీగా ఉన్న మరో యువకుడితో కలిసి అక్కడి నుంచి చెక్కేశారు.

 వెంటాడినా తప్పించుకున్నారు

వెంటాడినా తప్పించుకున్నారు

బాధితురాలు ధనలక్ష్మి షాక్కు గురై దొంగ దొంగ అని గట్టిగా కేకలు వేసింది. విషయం గుర్తించిన స్థానికులు బైక్ లో చైన్ లాక్కొని పారిపోతున్న నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. వారు వెలుతున్న బైక్ ను స్థానికులు వెంబడించారు. అయితే ధనలక్ష్మి మంగళసూత్రం లాక్కొని బైక్ లో వెళ్లిన ఇద్దరూ చాకచక్యంగా తప్పించుకుని పరారైనారు.

 సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ తో షాక్

సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ తో షాక్

ధనలక్ష్మి భర్త సెల్వ కుమార్ ఫిర్యాదు చెయ్యడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ ఆధారం దర్యాప్తు చేసిన పోలీసులు చైన్ స్నాచింగ్ చేసిన వారి బైక్ నెంబర్ ను గుర్తించి పట్టుకున్నారు. చైన్ స్నాచింగ్ చేసిన వారిలో కోయంబత్తూరు యూత్ కాంగ్రెస్ వైప్ ప్రెసిడెంట్ ఉండటంతో బిత్తరపోయారు. యూత్ కాంగ్రెస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ ను అరెస్టు చేసి జైలుకు పంపించడం కోయంబత్తూరులో కలకలం రేపింది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అనే విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+