చెన్నై ఎక్స్‌ప్రెస్ దోపిడీ: స్టూవర్ట్‌పురం గ్యాంగ్ పనే?
విజయవాడ: చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు దోపిడీ కేసులో పోలీసులు ముందడుగు వేశారు. రైలులో దోపిడీకి పాల్పడింది స్టువర్డుపురం గ్యాంగ్‌గా పోలీసులు నిర్దారించినట్లు వార్తలు వస్తున్నాయి. రైలులో దొంగతనం అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన రైల్వే పోలీసులు సెల్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది.
దోపిడీ గ్యాంగ్ నిడుబ్రోలులో ప్రయాణికుల్లాగా రైలు ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. గ్యాంగ్‌లో మహిళ, ఐదుగురు పురుషులు ఉన్నారు. ఓ మహిళా ప్రయాణికురాలు వద్ద నుంచి దోపిడీ చేసిన సెల్ నుంచి పిడుగురాళ్లలో గ్యాంగ్ పలువురికి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగానే పోలీసులు విచారణ జరిపి దోపిడీకి పాల్పడింది స్టువర్డుపురం గ్యాంగ్‌గా నిర్దారించారు.

మరో రెండు రోజుల్లో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంగళవారంనాడు చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోని ఆరు బోగీల్లో దోపిడీ పాల్పడిన దుండగులు భారీగా నగదును అపహరించిన విషయం తెసిందే.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ సమీపంలోని తుమ్మల చెరువు వద్ద చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ దోపిడీ జరిగింది. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున 2.10గంటల సమయంలో జరిగింది. రైల్లో ప్రయాణిస్తున్న సుమారు 10 మంది దుండగులు తుమ్మలచెరువు వద్ద చైన్ లాగి రైలుని నిలిపి వేసి దోపిడీకి పాల్పడ్డారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications