Learder: కిడ్నాప్, రేప్ కేసు, అధికార పార్టీ లీడర్ కు సినిమా చూపించిన పోలీసులు, ఏం జరిగిందంటే !

బెంగళూరు/గదగ్: అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి మీద మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేశాడని, ఆమె మీద అత్యాచారం చేశాడని కేసు నమోదు కావడం కలకలం రేపింది. తన దగ్గర పని చేస్తున్న దంపతుల కూతురుని కిడ్నాప్ చెయ్యడమే కాకుండా ఆమె మీద అత్యాచారం చేశాడని బాధితురాలు స్వయంగా పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చిందని పోలీసు అధికారులు అంటున్నారు. పోలీసులు అధికార పార్టీకి చెందిన నాయకుడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేస్తున్న సమయంలో ఆ నాయకుడు రెచ్చిపోయాడని తెలిసింది.

నాకు అధికారంలో ఉన్న సీనియర్ మంత్రి తెలుసు, ఇప్పుడు మంత్రికి ఫోన్ చేసి మీ అంతు చూస్తా అంటూ పోలీస్ స్టేషన్ లో ఆ నాయకుడు చిందులు వేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడి పీఏ కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి రాజీ చెయ్యడానికి ప్రయత్నించాడని తెలిసింది. అయితే అప్పటికే అధికార పార్టీ నాయకుడు రాద్దాంతం చెయ్యడంతో పోలీసులు ఆయనగారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

 మైనారిటీ మోర్చా సీనియర్ నాయకుడు

మైనారిటీ మోర్చా సీనియర్ నాయకుడు

కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. కర్ణాటకలోని గదగ్ జిల్లా బీజేపీ మైనారిటీ మోర్చ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్న సికిందదర్ (42)స్థానికంగా ముస్లీంల్లో బీజేపీలో చురుకుగా పని చేస్తున్న మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. భూస్వామి అయిన సికిందర్ ఓ టైపు నాయకుడు అని సమాచారం.

 పొలిటికల్ లీడర్ దగ్గర పని చేస్తున్న దంపతులు

పొలిటికల్ లీడర్ దగ్గర పని చేస్తున్న దంపతులు

సికందర్ బీజేపీలో ఉండటం, కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండటంతో సికిందర్ మాటకు ఎక్కువ విలువ వచ్చింది. సికిందర్ భూముల్లో దంపతులు పని చేస్తున్నారు. దంపతులకు ఓ కూతురు ఉంది. దంపతుల కూతురు మైనర్. మైనర్ అమ్మాయి మీద కన్ను వేసిన సికిందర్ ఆమెను అనుభవించాలని స్కెచ్ వేశాడని తెలిసింది.

 కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన లీడర్ ?

కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన లీడర్ ?

ఏప్రిల్ 17వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన మైనర్ అమ్మాయిని సికిందర్ కిడ్నాప్ చేసి అతని బంధువుల ఇంటికి పిలుచుకుని వెళ్లాడని తెలిసింది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అమ్మాయిని నమ్మించిన సికిందర్ ఆమె మీద అత్యాచారం చేశాడని తెలిసింది.

 నాటకాలు ఆడిన సికిందర్

నాటకాలు ఆడిన సికిందర్

కూతురు రెండు రోజుల నుంచి కనపడకపోవడంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టడానికి సిద్దం అయ్యారు. ఆ సమయంలో సికిందర్ మీ కూతురు బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుందని, పోలీసు కేసు పెడితే లేనిపోని సమస్యలు వస్తాయని బాలిక తల్లిదండ్రులకు నచ్చచెప్పి కేసు పెట్టకుండా చేశాడు

 మ్యాటర్ మొత్తం చెప్పిన అమ్మాయి

మ్యాటర్ మొత్తం చెప్పిన అమ్మాయి

అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెడుతారనే భయంతో సికిందర్ బంధువుల ఇంటిలో నిర్బందించిన అమ్మాయిని వదిలేశాడు. ఇంటికి వెళ్లిన బాలిక సికిందర్ తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని చెప్పడంతో అందరూ హడలిపోయారు. కుటుంబ సభ్యులు బాలికను నేరుగా పిలుచుకుని వెళ్లి పోలీసు కేసు పెట్టారు.

 రెచ్చిపోయిన బీజేపీ నాయకుడు

రెచ్చిపోయిన బీజేపీ నాయకుడు

పోలీసులు అధికార పార్టీకి చెందిన నాయకుడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేస్తున్న సమయంలో ఆ నాయకుడు రెచ్చిపోయాడని తెలిసింది. నాకు అధికారంలో ఉన్న సీనియర్ మంత్రి సీసీ పాటిల్ తెలుసు, ఇప్పుడు మంత్రికి ఫోన్ చేసి మీ అంతు చూస్తా అంటూ పోలీస్ స్టేషన్ లో ఆ నాయకుడు చిందులు వేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడి పీఏ కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి రాజీ చెయ్యడానికి ప్రయత్నించాడని తెలిసింది. అయితే అప్పటికే అధికార పార్టీ నాయకుడు రాద్దాంతం చెయ్యడంతో పోలీసులు ఆయనగారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+