గెలుపు ఆరంభం.. ఒక్క మున్సిపాలిటీలో కామ్రేడ్ల విజయం, సుజన్ చక్రవర్తి ధీమా
బెంగాల్ స్థానిక సంస్థలను దాదాపుగా అధికార టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. ఒక చోట కమ్యునిస్టులు గెలుచుకున్నారు. మరీ దీనిపై కామ్రెడ్ల ధీమా మాములుగా లేదు. ఇదీ తమ ఆరంభం అని.. జనం తమకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇదీ దోహదం చేస్తోందని సీపీఎం నేత సుజన్ చక్రవర్తి అన్నారు.
రాష్ట్రంలో బీజేపీ ఓట్ల శాతం తగ్గుతుందని వివరించారు. ఇదీ 2018 నుంచి ప్రారంభమయ్యిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటుతోందా అనే సందేహాం ఉండేదని తెలిపారు. వాస్తవానికి పార్లమెంట్, శాసనసభలో తమ పార్టీకి చెందిన అభ్యర్థులు లేరని చెప్పారు. అయినప్పటికీ నదియా జిల్లాలో గల తహెర్‌పూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నామని వివరించారు. 100కు పైగా చోట్ల టీఎంసీ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీకి ఇక్కడి ప్రజలు విశ్వాసం చూపలేదు. ఒక్క చోట కూడా ఆ పార్టీ మారలేదు.

టీఎంసీ అన్నీ చోట్ల ప్రభావం చూపడానికి కారణం వివరించారు. ఆ పార్టీ ఫిబ్రవరి 27వ తేదీన అవకతవకలకు పాల్పడిందని చెప్పారు. టీఎంసీ నేతలు/ శ్రేణులు వచ్చేవరకు ఎవరో ఓటు వేశారని తెలిపారు. ఇలా చాలా చోట్ల జరిగాయని తెలిపారు.
బెంగాల్‌లో మమతా హవా కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తియన పది నెలల తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన 108 మున్సిపాలిటీలలో 102 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 77 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన బీజేపీ.. ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోలేకోయింది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక్క సీటు దక్కలేదు.












Click it and Unblock the Notifications