వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రముఖ సంగీత విద్యాంసుడు ముస్తాఫా ఖాన్ కన్నుమూత: ప్రధాని మోడీ సంతాపం

|
Google Oneindia TeluguNews
Legendary Musician Ustad Ghulam Mustafa Khan Dies At 89

ముంబై: ప్రముఖ సంగీత విద్యాంసుడు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఉస్తాద్ గులామ్ ముస్తాఫా ఖాన్(89) కన్నుమూశారు. ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కోడలు నమ్రతా గుప్తాఖాన్ తెలిపారు.

2019లో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ముస్తాఫా ఖాన్ ఎడమవైపు భాగం పనిచేయడం లేదు. దీంతో అప్పటి నుంచి ఆయన మంచానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కాసేపటికే మరణించారు. ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనునున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్‌లో 1931 మార్చి 3న ముస్తాఫా జన్మించారు. ఆయనకు నలుగురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. అందరికంటే ఆయనే పెద్దవారు. తండ్రి ఉస్తాద్ వారిస్ ఖాన్ నుంచి వారసత్వంగా శాస్త్రీయ సంగీతాన్ని అందిపుచ్చుకున్నారు.

సంగీత ప్రపంచానికి ముస్తాఫా ఖాన్ అందించిన సేవలకు గానూ 1991లో కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. 2006లో పద్మభూషణ్, 2018లో పద్మవిభూషణ్ పురస్కారాలు ఆయనను వరించాయి. 2003లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డును అందుకున్నారు. గులామ్ ముస్తాఫా ఖాన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ సాహబ్ కన్నుమూయడం మన సాంస్కృతిక ప్రపంచానికి తీరనిలోటు. ఆయన సంగీతానికి ఒక విశిష్టత ఉంది. అతని రచనలు తరతరాలుగా ప్రజలకు నచ్చాయి. ఆయనతో సంభాషించిన జ్ఞాపకాలు నాకు చాలా ఉన్నాయి. ఆయన కుటుంబానికి, ఆరాధకులకు సంతాపం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

English summary
Legendary Indian classical musician and Padma Vibhushan awardee Ustad Ghulam Mustafa Khan died on Sunday afternoon at his residence in Mumbai. He was 89.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X