Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తున్నారా? అయితే ఈ అంశాలను కచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి!!

నిజ జీవితంలో చాలామంది చాలా సందర్భాలలో అప్పు చేస్తుంటారు. అప్పు లేకుండా జీవితం గడవదు. ఒక్కోసారి ఎంత డబ్బు ఉన్న వ్యక్తి అయినా సమయానికి చేతిలో డబ్బు లేకుంటే అప్పు చేయాల్సి వస్తుంది. అయితే కొందరు సరైన ఆర్థిక ప్రణాళిక లేక ఆర్థిక ఇబ్బందులతో అప్పులు చేసి, అప్పు ఇచ్చిన వారికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుగా డబ్బు ఇచ్చి, సమయానికి ఆదుకొని, తీరా వారికి అవసరమైన సమయంలో డబ్బు ఇవ్వకుంటే డబ్బులు ఇచ్చిన వ్యక్తులు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అందుకే అప్పు ఇచ్చే విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఆర్థిక శాస్త్ర నిపుణులు.

అప్పులు ఇస్తున్నారా? అయితే అవతలి వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండాలి

అప్పులు ఇస్తున్నారా? అయితే అవతలి వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండాలి

తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర అప్పు తీసుకోవడానికి చాలామందికి ఇబ్బంది ఉండదు. అదే బ్యాంకుల నుండి అప్పు తీసుకోవాలంటే, బ్యాంకులు అనేక నిబంధనలు పెడతాయి. ఆస్తులను తనఖా పెట్టుకుని మరి అప్పులు ఇస్తాయి. ఒకవేళ అప్పు తీర్చకుంటే ఏం చేయాలనేది కూడా ముందే నిర్ణయించుకొని, బ్యాంకులు అప్పులు ఇస్తాయి. కానీ నిజజీవితంలో బయట అప్పు ఇచ్చే వాళ్ళు ఇవన్నీ పరిగణలోకి తీసుకోరు. ముఖ్యంగా సమీప బంధువులు, తెలిసినవారు అని భావించిన దగ్గర వారు అవసరానికి డబ్బులు అప్పుగా ఇస్తారు. అయితే ఆ అతి విశ్వాసమే అనేక సందర్భాల్లో ఎంతో మంది డబ్బులు ఇచ్చే వారి కొంప ముంచుతుంది. అందుకే అప్పు ఇచ్చేటప్పుడు కచ్చితంగా అవతల వ్యక్తి లో కొన్ని లక్షణాలను పరిగణలోకి తీసుకోవాలని చెబుతారు.

అప్పు తీసుకునే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవాలి

అప్పు తీసుకునే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవాలి


అందులో ముఖ్యమైనది వ్యక్తిత్వం. ఒక వ్యక్తికి మనము డబ్బు అప్పుగా ఇవ్వాలంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్న వారమై ఉండాలి. ఆ వ్యక్తి డబ్బు ఎందుకు అప్పు చేస్తున్నాడు? తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చే మనస్తత్వం ఉన్నవాడా? కాదా? ఏదైనా మాటిస్తే మాటమీద నిలబడే వ్యక్తి నా? కాదా? అసలు అతను అప్పు చేస్తున్న కారణం ఏంటి? అతని ఆర్థిక పరిస్థితి ఏంటి? తిరిగి చెల్లించగలిగే స్తోమత ఉందా? తిరిగి చెల్లించక పోయిన భరించగలిగే శక్తి మనకు ఉందా? అతను ఇబ్బంది పెడితే ఒత్తిడికి గురి కాకుండా సమస్యను పరిష్కరించుకోగలిగే సత్తా ఉందా? అనే అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

అప్పు తీసుకునే వ్యక్తి స్వభావాన్ని తెలుసుకోవాలి

అప్పు తీసుకునే వ్యక్తి స్వభావాన్ని తెలుసుకోవాలి

చాలామంది ఉద్యోగాలు చేసేవారికి, ఆస్తులు ఉన్నాయని భావించే వారికి అడిగినంత డబ్బులు ఇస్తే ఆ తర్వాత వారు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే అప్పు ఇవ్వడానికి ఉద్యోగం, వారికుండే ఆస్తులు క్రైటీరియా కాదు. బాగా ఆస్తి ఉన్న వ్యక్తికి కూడా కొన్నిసార్లు డబ్బులు తీసుకుంటే తిరిగి ఇచ్చే గుణం ఉండదు. కాబట్టి అప్పు ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

అప్పు ఇచ్చేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఇవే

అప్పు ఇచ్చేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఇవే


చాలా సందర్భాలలో నిరుపేద అయినప్పటికీ, అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఖచ్చితంగా సమయానుకూలంగా చెల్లిస్తాడు. బాగా డబ్బు ఉన్న వ్యక్తులు కూడా కొన్ని సందర్భాలలో డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు. కాబట్టి వ్యక్తి స్వభావాన్ని ఖచ్చితంగా అంచనా వేసుకున్న తర్వాతే అప్పుగా ఇవ్వడం గురించి ఆలోచించాలి. ఒక వ్యక్తికి డబ్బు అప్పుగా ఇవ్వాలంటే అతను ఏం పని చేస్తాడు? ఎంత సంపాదిస్తారు? అతని కుటుంబ పరిస్థితి ఏంటి? ఇంతకు ముందు ఇలాగే ఎక్కడైనా అప్పులు చేశాడా? అతను తీసుకుంటున్న అప్పు అభివృద్ధి కోసం తీసుకుంటున్నాడా? లేక.. ఆర్థిక ఇబ్బందులతో తీసుకుంటున్నాడా? అతనికి ఉన్న ఆర్థిక ఇబ్బందులతో తిరిగి మన డబ్బులు చెల్లించగలుగుతాడా వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రామిసరీ నోటు పై పక్కాగా రాసుకుంటేనే బెస్ట్

ప్రామిసరీ నోటు పై పక్కాగా రాసుకుంటేనే బెస్ట్


అంతేకాదు ఎప్పుడు ఎవరికి అప్పు ఇచ్చిన మాట మీద నమ్మకం, మనిషి నమ్మకం మీద కంటే ప్రామిసరీ నోటు మీద పక్కాగా రాసుకొని ఇవ్వడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో మనం ఇచ్చే అప్పుల వల్ల మన ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినకూడదని సలహా ఇస్తున్నారు. మనం నిర్ణయించుకున్న ఆర్థిక ప్రణాళికలో నుంచి అప్పుల కోసం కేటాయించకూడదని కూడా సలహా ఇస్తున్నారు.

Disclaimer: ఈ కథనం ఆర్ధిక నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+