గర్ల్స్ హాస్టల్ లో చొరబడిన చిరుత: రెచ్చిపోయింది, తప్పించుకుని పరుగో పరుగు (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ముంబైలోని పశు, వైద్య కళాశాల ఆవరణంలోని గర్ల్స్ హాస్టల్ ఆవరణంలోకి చిరుత చొరబడటంతో అక్కడి విద్యార్థినిలు హడలిపోయారు. అర్దరాత్రి గర్ల్స్ హాస్టల్ లో చొరబడిన చిరుత నానా హంగామా చేసింది. ఈ దెబ్బతో అమ్మాయిలు ఆందోళనకు గురైనారు.

పశు వైద్య శాఖ ఆవరణంలోని గర్ల్స్ హాస్టల్ లో కాలేజ్ అమ్మాయిలు అర్దరాత్రి అందరూ హాయిగా నిద్రపోతున్నారు. గర్ల్స్ హాస్టల్ లో భద్రత కోసం కాపలా పెట్టిన కుక్కలు మాత్రమే తిరుగుతున్నాయి. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో ఓ చిరుత హాస్టల్ ఆవరణంలోని విశాలమైన పార్క్ లోకి చొరబడింది.

Leopard barges into girls hostel, attacks dog in Mumbai.

అక్కడే తిరుగుతున్న ఓ కుక్క మీద దాడి చేసింది. సమీపంలో ఉన్న మరో కుక్క చిరుత దాడి నుంచి సాటి కుక్కను కాపాడటానికి ప్రయత్నించింది. అయితే భయంతో ఆ కుక్క తన ప్రయత్నాన్ని విరమించుకుని భయంతో పరుగు తీసింది. చిరుతతో పోరాడిన కుక్క చివరికి దాని దాడి నుంచి తప్పించుకుని పరుగు తీసింది.

అయితే చిరుత మాత్రం ఆకుక్కను వెంటాడింది. గర్ల్స్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు మొత్తం రికార్డు అయ్యాయి. విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే అటవి శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ప్రస్తుతం గర్ల్స్ హాస్టల్ లో చిరుత దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A leopard barged into girls hostel of Bombay Veterinary College and attacked two dogs. The incident was recorded in the CCTV camera.
Please Wait while comments are loading...