శుభవార్త: 5 రోజుల్లోనే పీఎప్ డబ్బులు, ఆధార్‌తో యూఏఎన్ నెంబర్ లింక్ ఇలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పిఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌లో మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్‌తో పిఎఫ్ నెంబర్‌ను అనుసంధానం చేయడంతో పాటు యూఏఎన్ నెంబర్‌ను కూడ ఆన్‌లైన్‌లో పొందే సదుపాయాన్ని కల్పించింది.

షాక్: పీఎఫ్ వడ్డీరేట్లలో కోతకు యోచన, 8.65 కంటే తక్కువ వడ్డీ?

ఈపీఎఫ్ఓ ఇటీవల పిఎఫ్ చందాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.అయితే ఇటీవలనే పీఎప్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు కూడ ఉన్నాయనే ప్రచారం కూడ సాగింది.అయితే ఈ విషయమై ఇంకా స్పష్టమైన ప్రకటన మాత్రం రాలేదు.

శుభవార్త: ఈక్విటీల్లో 15% పీఎఫ్, లాభం కోసమిలా 3 ఏళ్ళు ఇలా..

ఈపీఎఫ్ ఖాతా దారులు ఇంటి నుండే ఆన్‌లైన్ ద్వారా యూఏఎన్ నెంబర్‌ను సృష్టించవచ్చు. అంతేకాదు తమ ఖాతాలో మార్పులు చేర్పులను కూడ సరిచేసుకొనే వెసులుబాటను కూడ ఈపీఎఫ్ఓ కల్పించింది.

పీఎఫ్ చందాదారులకు మెరుగైన సౌకర్యాలు

పీఎఫ్ చందాదారులకు మెరుగైన సౌకర్యాలు

భవిష్య నిధి చందాదారులకు ఈపీఎఫ్‌వో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. తప్పులు సరిచేసుకోవడం, ఆధార్‌ అనుసంధానం సహా..కొత్తగా విశిష్ఠ ఖాతా సంఖ్య(యూఏఎన్‌) ఆన్‌లైన్‌ ద్వారా పొందే సదుపాయాన్ని కల్పించింది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి యూనిఫైడ్ పోర్టల్‌లో ఆధార్ నెంబర్‌ను నమోదు చేసుకొనే వెసులుబాటు కూడ దక్కింది.

ఆధార్ నెంబర్ ఇలా

ఆధార్ నెంబర్ ఇలా

యూనిఫైడ్ పోర్టల్‌లో ఆధార్‌ సంఖ్య నమోదు చేయగానే ఆధార్‌కు అనుసంధానమైన చరవాణి సంఖ్యకు ఓటీపీ (వన్ టైమ్ పాస్ వర్డ్) వస్తుంది.దాన్ని, ఆధార్‌ సంఖ్యను అందులో నమోదు చేస్తే ఆధార్‌ అనుసంధానమైనట్టేనని ఈపీఎఫ్ఓ ప్రకటించింది.

నగదు వెంటనే బ్యాంక్ ఖాతాల్లోకి

నగదు వెంటనే బ్యాంక్ ఖాతాల్లోకి

నగదు వెంటనే బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యేలా ఈపీఎఫ్ఓ చర్యలు చేపట్టింది. గతంలో చందాదారు తన ఖాతాల్లోని నగదు ఉపసంహరణ, పదవీ విరమణ రాబడులకు ఆమోదం పొందిన తరువాత కూడా నగదు జమ అయ్యేందుకు సమయం పట్టేది. ఇప్పుడు వాటిని జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) నిర్వహిస్తోంది.

ఇకపై రాబడుల తాలూకూ మొత్తాలు ఖరారైన వెంటనే సంబంధిత బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది.

పీఎఫ్ ఖాతాలో సవరణలకు అవకాశం

పీఎఫ్ ఖాతాలో సవరణలకు అవకాశం

పీఎఫ్ ఖాతాలో సవరణలకు కూడ అవకాశం కల్పించింది ఈపీఎఫ్ఓ. తప్పుగా నమోదైన ఖాతాదారు తాలూకూ వివరాల్లో మార్పు చేయాలంటే గతంలో యజమానితో కలిసి..సంయుక్తంగా ఈపీఎఫ్‌వో కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాల్సి వచ్చేది. ఇకపై ఉద్యోగి యూనిఫైడ్‌ పోర్టల్‌లోని చందాదారు వివరాల సవరణ పేజీలో ఆధార్‌ నమోదు చేస్తే..అందులోని వివరాలు కన్పిస్తాయి. అందులో పుట్టిన తేదీ, పేర్లు, ఇతర వివరాల్లో తప్పులు సవరించుకోవచ్చు. దాన్ని యజమాని ఆమోదించిన వెంటనే..అవి ఈపీఎఫ్‌వో డేటాబేస్‌కు వెళ్తాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As the EPFO had been taking steps to reduce the time taken to settle PF claims. Earlier the EPFO had introduced the 'Composite claim form (Aadhaar)', and the need for employer's attestation was done away with.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X