ఆధార్ అనుసంధానం తప్పనిసరి: మరోసారి స్పష్టం చేసిన ఆర్బీఐ
ఆధార్ నంబర్‌తో బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి అని, డిసెంబర్ 31 లోగా ప్రతి బ్యాంక్ ఖాతాదారుడు.. తన ఖాతాను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ముంబై : ఆధార్ నంబర్‌తో బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి అని రిజర్వ్ బ్యాంక్ ఇండియా శనివారం మరోసారి స్పష్టం చేసింది. ఆధార్ నెంబర్‌తో బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేయాల్సిన అవసరం లేదంటూ వస్తున్న కథనాలను ఆర్బీఐ తీవ్రంగా ఖండించింది.
చట్టవ్యతిరేక లావాదేవీలను నియంత్రించే క్రమంలో బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేయాల్సిందేనని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం - 2017 ప్రకారం ఇది తప్పనిసరి అని ఆర్బీఐ పేర్కొంది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం - 2017ను అనుసరించి అన్ని బ్యాంకులు తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా.. అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది.
డిసెంబర్ 31 లోగా ప్రతి బ్యాంక్ ఖాతాదారుడు.. తన ఖాతాను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications