బీరు ప్రియులకు ఊహించని అప్డేట్..!!
బీరు ప్రియులకు కీలక అప్డేట్. వేసవి తీవ్రత.. ఐపీఎల్ మ్యాచులతో పాటు వరుసగా శుభకార్యాల తో బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కొత్త రికార్డు నెలకొల్పాయి. ఇదే సమయంలో ధరల పెంపు ప్రతిపాదనల పైన నిర్ణయం వెలువడేందుకు రంగం సిద్దం అవుతోంది. జూన్ 2వ తేదీ తరువాత బీర్లతో పాటుగా కొన్ని ఎంపిక చేసిన బ్రాండెడ్ మద్యం ధరలు పెరగనున్నాయి. కాగా.. బీర్ల అమ్మకాలు గతం కంటే ఒక్క సారిగా పెరిగాయి.
వేసవి తీవ్రత వేళ బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నగరంలోని మైక్రో బ్రేవరీలలో గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం, ఐపీఎల్ సీజన్ సాగుతుండటం... పార్టీ కల్చర్ పెరగడంతో వీటికి డిమాండ్ గణనీయంగా పెరిగింద ని నివేదికలు చెబుతున్నాయి. గత వేసవితో పోలిస్తే ఈ సంవత్సరం మైక్రోబ్రేవరీలలో అమ్మకాల పరంగా 30నుంచి 35 శాతం వృద్ధి కనిపిస్తోంది. నగరంలోని జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, ఫైనాన్షి యల్ డిస్ట్రిక్ట్ సహా పలు ప్రాంతాల్లో ఉన్న మైక్రోబ్రేవరీలన్నింటిలో వారాంతాల్లో ప్రవేశించడమే కష్టంగా మారుతోంది. మిగిలిన రోజులలో కూడా రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నగరంలోని ప్రతి మైక్రోబ్రేవరీ రోజుకు గరిష్టంగా 1000 లీటర్ల కంటే ఎక్కువ బీరు ఉత్పత్తి చేయడానికి లేదు.

రికార్డు స్థాయిలో అమ్మకాలు
ఈ వెయ్యి లీటర్లలోనే నాలుగు నుంచి ఆరు వరకూ ఫ్లేవర్లను పలు మైక్రోబ్రేవరీలు ఉత్పత్తి చేస్తుంటే, వారాంతాలలో ఈ వెయ్యి లీటర్ల అమ్మకాలు పూర్తి అయిపోతున్నాయి. బీర్ల రుచుల వైవిధ్యత పరంగా ప్రతి బ్రేవరీ తమదైన సిగ్నేచర్‌ను ఉత్పత్తిలో చూపుతోంది. నగరంలో ఇప్పుడు ఫ్రూట్, సైడర్ బీర్లు మరీ ముఖ్యంగా మ్యాంగో సైడర్, స్ట్రాబెర్రీ, యాపిల్ సైడర్ బీర్లతో పాటుగా బెల్జియన్ విట్, హైఫెవైజెన్ వంటి బీర్ల అమ్మకాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. వీటితో పాటుగా మ్యాంగో చిల్లీ ఏల్, బాస్మతి ప్రీమియం లాగర్, హైబిస్కస్ సైడర్ వంటి ఫ్లేవర్లను ఈ బీర్లలో ఉత్పత్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications