భారత్ లో LPG గ్యాస్ సిలిండర్ షార్టేజ్ ఉందా..??

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వాణిజ్య రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు సంక్షోభంలోకి వెళ్లాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పశ్చిమాసియా యుద్ధ సెగలు ప్రపంచ దేశాలతోపాటు భారత్ నూ తాకాయి. ఈ క్రమంలో భారత్ లోనూ వారం రోజుల వ్యవధిలో ఏకంగా నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లను సవరించారు. అటు LPG గ్యాస్ బుకింగ్, డెలివరీలోనూ పలు కీలక మార్పులు చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల విషయంలో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.

పీఎన్జీ ఉంటే సబ్సిడీ ఎల్పీజీ లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు, ఇకపై సబ్సిడీ గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను ఉపయోగించడానికి అనుమతి లేదు. అలాగే పీఎన్జీ కనెక్షన్ తీసుకునే వినియోగదారులు 30 రోజుల్లోగా ఓ నిర్ణయం తీసుకోవాలి. తమ ఎల్పీజీ కనెక్షన్ ను పూర్తిగా సరెండర్ చేయాలి. లేదా భవిష్యత్తులో పీఎన్జీ సౌకర్యం లేని ప్రాంతాల్లో ఉపయోగించుకోవడానికి వీలుగా ఎల్పీజీ కనెక్షన్ ను ట్రాన్స్ ఫర్ ఓచర్ ఆప్షన్ గా మార్చుకోవాలి.

ఇక ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉన్నాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలు 14.2 కేజీలు.. హైదరాబాద్ లో రూ. 855, బెంగళూరులో రూ. 805, దేశ రాజధాని దిల్లీలో రూ. 803, ముంబైలో రూ. 802, కోల్ కతాలో రూ. 829, అలాగే చెన్నైలో రూ. 818, లక్నో లో రూ. 840, పాట్నాలో రూ. 892, నోయిడాలో రూ. 910, గురుగ్రామ్ లో అయితే రూ. 921 గా ఉన్నాయి. అలాగే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు 19 కేజీలు.. దిల్లీలో రూ. 1,740, ముంబైలో అయితే రూ. 1,692, కోల్ కతాలో రూ. 1,850, ఇక నోయిడా, గురుగ్రామ్ లో అయితే రూ. 3 వేలకు పైగానే రేట్లు ఉన్నాయి.

LPG Cylinder Shortage in India Are Domestic Consumers Facing Supply Issues Right Now LPG Cylinder

దేశంలో గృహ వినియోగదారుల అవసరాలకు సరిపడా ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. వినియోగదారుల బుకింగ్ ఆధారంగా నిల్వల సరఫరా నిరంతరాయంగా జరుగుతోంది. సమాన పంపిణీ కోసం పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల బుకింగ్ విరామ నిబంధనలు అమలులో ఉన్నాయి. మరోవైపు గ్యాస్ కొరత వస్తుందనే పుకార్ల కారణంగా చాలామంది వినియోగదారులు ఒకేసారి సిలిండర్లను బుక్ చేసుకోవడం వల్ల స్థానికంగా పంపిణీ కేంద్రాల్లో తాత్కాలిక నిల్వల కొరత ఏర్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+