షాక్: ఇన్సూరెన్స్ పాలసీలకు కూడ ఆధార్ తప్పనిసరి

Posted By:
Subscribe to Oneindia Telugu
  Aadhaar Linking Mandatory For Insurance Policies | Oneindia Telugu

  న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు, టెలిఫోన్ నెంబర్లను ఆధార్‌తో అనుసంధానం చేయాల్సిన సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇన్సూరెన్స్ పాలసీని కూడ ఆధార్‌తో అనుసంధానం చేయాలనే కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.

  ఆధార్‌ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడ కేంద్ర ప్రభుత్వం మాత్రం కొన్ని విషయాల్లో ఆధార్‌ అమలు చేయడం తప్పనిసరిగా తేల్చి చెప్పింది. సంక్షేమ పథకాల లబ్ది కోసం ఆధార్‌ను అనుసంధానం చేయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

  టెలిఫోన్ నెంబర్‌ను కూడ ఆధార్‌తో అనుసంధానం చేయాలని సూచించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని గడువు ఇచ్చింది. తాజాగా మరో షాక్ వచ్చి పడింది.

   ఇన్సూరెన్స్ పాలసీలు కూడ ఆధార్‌తో అనుసందానం చేయాలి

  ఇన్సూరెన్స్ పాలసీలు కూడ ఆధార్‌తో అనుసందానం చేయాలి

  బీమా పాలసీలతో ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఆధార్‌ అనుసంధానం చేయడం తప్పని సరి అని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రకటించింది. ప్రివెన్షన్‌ ఆఫ్‌మనీ లాండరింగ్‌ చట్టం 2017సవరించిన నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరని తేల్చి చెప్పింది. ఈ మేరకు దేశంలోని అన్ని బీమా సంస్థలకు సమాచారాన్ని అందించింది. అలాగే బీమాపాలసీలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని పాలసీదారులను కోరింది.

   ఆధార్, పాన్‌ నెంబర్లను అనుసంధించాలి

  ఆధార్, పాన్‌ నెంబర్లను అనుసంధించాలి

  అన్ని బీమా పాలసీలకు కూడా ఆధార్, పాన్ నంబర్లతో అనుసంధానం చేయడం తప్పనిసరని ఐఆర్‌డీఏఐ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న కొత్త బీమా పాలసీలకు కూడా ఆధార్, పాన్ నంబర్లను అనుసంధానం చేయాలని ఐఆర్‌డిఎ కోరింది.

   ఆధార్ లేకపోతే ఇక అంతే

  ఆధార్ లేకపోతే ఇక అంతే

  దేశంలో మొత్తం 24 జీవిత బీమా సంస్థలు, 33 జనరల్ ఇన్స్యూరెన్స్ సంస్థలు ఉన్నాయి. తాజా నిర్ణయంతో ఇక మీదట ఈ కంపెనీల పాలసీలన్నీ ఇక ఆధార్ తో అనుసంధానించుకోవాలి. ఇప్పటికే జీవిత బీమా సంస్థలు బీమా క్లెయిములను నగదు రూపంలో చెల్లించకుండా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తున్నాయి.

   రూ. 50 వేల చెల్లింపులకు పాన్‌కార్డ్ తప్పనిసరి

  రూ. 50 వేల చెల్లింపులకు పాన్‌కార్డ్ తప్పనిసరి

  రూ.50వేలకు మించిన బీమా ప్రీమియం చెల్లింపులకు పాన్ కార్డు నంబరు ఇవ్వాలని బీమా సంస్థలు కోరుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ నిర్ణయాన్ని ఐసిఐసిఐ లాంబార్డ్ సీఎండి భార్గవ్ దాస్ గుప్తా స్వాగతించారు. ఆరంభంలో స్వల్పకాలిక సవాళ్లను అధిగమించాల్సి ఉన్నప్పటికీ మోసాలను , అక్రమాలను నిరోధించే క్రమంలో ఇది గణనీయమైన దీర్ఘకాల ప్రయోజనాలను ఉంటాయని ఆయన చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Insurance regulator IRDAI said on Wednesday that linkage of unique identity number Aadhaar with insurance policies was mandatory and asked insurers to comply with the statutory norms.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి