భారత్ లో ప్రైవేటు క్రిప్టో కరెన్సీలు, ఎక్సైంజ్ లు ఇవే-పార్లమెంటు సమావేశాల్లో ఆమోదిస్తే అమల్లోకి

దేశవ్యాప్తంగా ప్రైవేటు క్రిప్టో కరెన్సీపై చర్చ జరుగుతున్న వేళ వీటి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంటులో నియంత్రణ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. క్రిప్టో కరెన్సీ వల్ల నష్టాల నేపథ్యంలో దీన్ని నిషేధించాలనే డిమాండ్లు పెరుగుతున్నా కేంద్రం మాత్రం నియంత్రణకే మొగ్గు చూపుతోంది. దీంతో ప్రస్తుతం దేశంలోకి ప్రవేశించిన పలు క్రిప్టో కరెన్సీలపై సాధారణ ఆసక్తి పెరుగుతోంది. పార్లమెంటులో కేంద్రం ఆమోదిస్తే వీటి వాడకం కూడా మొదలుకానుంది.

Recommended Video

    Private Cryptocurrencies In India క్రిప్టో కరెన్సీ.. తెలుసుకోవాల్సిందే..!! || Oneindia Telugu
     క్రిప్టో కరెన్సీ కోసం డిమాండ్లు

    క్రిప్టో కరెన్సీ కోసం డిమాండ్లు

    కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీని అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఓ బిల్లును సిద్ధం చేసింది. అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లు 2021 పేరుతో దీన్ని తీసుకొస్తోంది. క్రిప్టోకరెన్సీ వాడకం, నియంత్రణ కోసం ఈ బిల్లు ఉపయోగపడనుంది. వాస్తవానికి ఈ సంవత్సరం ప్రారంభంలో పార్లమెంటు బడ్జెట్ సెషన్‌లో చర్చ, ఆమోదం కోసం ఈ బిల్లు లిస్ట్ చేసినా ఆచరణలో సాధ్యం కాలేదు. ఆర్బీఐ తన స్వంత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రారంభించే సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తోంది, అయితే పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి సాధ్యమయ్యే తేదీని ఇంకా నిర్ణయించలేదు. దీంతో క్రిప్టో కరెన్సీని సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

     క్రిప్టో కరెన్సీ విలువెంతో తెలుసా ?

    క్రిప్టో కరెన్సీ విలువెంతో తెలుసా ?

    భారతదేశంలో క్రిప్టోకరెన్సీని వాడేందుకు ఒక విధానాన్ని రూపొందించేందుకు ఈ పరిశ్రమతో పాటు కేంద్ర ప్రభుత్వం మధ్య ఇప్పటికే పలు సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే క్రిప్టోకరెన్సీ బిల్లు తెరపైకి వచ్చింది. ఇందులో క్రిప్టో కరెన్సీని దుర్వినియోగం కాకుండా వాడే అవకాశం కల్పించడం అలా అన్న దానిపైనే చర్చ సాగింది. ఈ మేరకు త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులో పలు రక్షణలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కిప్టో కరెన్సీ రంగం అంచనాల ప్రకారం, భారతదేశం దాదాపు 1.5 కోట్ల క్రిప్టోకరెన్సీ లావాదేవీల్ని నిర్వహిస్తోంది. వీటి మొత్తం విలువ $6 బిలియన్ల కంటే ఎక్కువని సమాచారం.

     ప్రైవేటు క్రిప్టో కరెన్సీలు, ఎక్ఛ్ంజ్ లు

    ప్రైవేటు క్రిప్టో కరెన్సీలు, ఎక్ఛ్ంజ్ లు

    భారతదేశంలోని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై చర్చ జరుగుతున్న వేళ అసలు దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేటు క్రిప్టో కరెన్సీలు, వాటి ఎక్సేంచ్ లపై ఓసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం భారత్ లో అందుబాటులో ఉన్న ప్రైవేటు క్రిప్టో కరెన్సీల ఎక్సేంజ్ లలో బెల్ ఫ్రిక్స్, బిట్ జోక్సో, బీటీసీఎక్స్ ఇండియా, బై బూ కాయిన్, కాయిన్ సెక్యూర్, కాయిన్ డెల్టా, కాయిన్ స్విచ్, ఫ్లిట్ పే ఉన్నాయి. వీటిలో బిట్ కాయిన్, బిట్ క్యాష్, ఎథీరియం, రిపుల్ తో పాటు పలు క్రిప్టో కరెన్సీలను మార్పిడి చేసుకునే వీలుంది. ప్రైవేటు క్రిప్టో కరెన్సీ ఎక్చేంజ్ ల ద్వారా వివిధ రకాల క్రిప్టో కరెన్సీలను మార్పిడి చేసుకునేందుకు ఆయన కంపెనీలు వేర్వేలు చార్జీలు, రిజిస్ట్రేషన్ సమయాలతో సేవలు అందిస్తున్నాయి.

     బెల్ ఫ్రిక్స్, బిట్ జోక్సో, బీటీసీఎక్స్ ఇండియా

    బెల్ ఫ్రిక్స్, బిట్ జోక్సో, బీటీసీఎక్స్ ఇండియా

    దేశంలో ప్రస్తుతం సేవలు అందిస్తున్న ప్రైవేటు క్రిప్టో కరెన్సీ ఎక్సైంజ్ లను గమనిస్తే..... మొదటిది బెల్ ఫ్రిక్స్. దీన్ని 2014లో ప్రారంభించారు. బెంగళూరు-కౌలాలంపూర్ కేంద్రంగా ఇది పనిచేస్తోంది. ఇందులో బిట్ కాయిన్ ను సాధారణ కరెన్సీతో మార్పిడి చేసుకోవచ్చు. ఇందుకు ఒక శాతం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఇన్ స్టంట్ గా రిజిస్టర్ చేసుకునేందుకు వీలుంది. రెండోది బిట్ జోక్సో. ఇది 2016లో ప్రారంభమైంది. తెలంగాణలోని వరంగల్ కేంద్రంగా ఇది పనిచేస్తోంది. హేషమ్ రెహ్మాన్, మహ్మద్ రిజ్వాన్ దీన్ని ప్రారంభించారు. ఇది బిట్ కాయిన్, బిట్ కాయిన్ క్యాష్, ఎథీరియం, రిపుల్ కరెన్సీలను మార్పిడి చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఎలాంటి ఛార్జీల్లోకుండానే దీన్ని ఇన్ స్టంట్ గా రిజిస్టర్ చేసుకుని వాడేసుకోవచ్చు. మూడోది బీటీసీఎక్స్ ఇండియా. ఇది 2013లో ప్రారంభమైంది. ఇది హైదరాబాద్ నుంచి పనిచేస్తోంది. దీన్ని ఎంఎస్ కామేశ్వరరావు అనే వ్యక్తి ప్రారంభించారు. ఇది కూడా బిట్ కాయిన్, ఎథీరియం మరియు రిపుల్ కరెన్సీలను మార్పిడి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. గంటల వ్యవధిలో రిజిస్టర్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్న ఈ కరెన్సీ ఒక శాతం ఛార్జీని తీసుకుంటోంది.

     బై యూ కాయిన్, కాయిన్ సెక్యూర్, కాయిన్ డెల్టా

    బై యూ కాయిన్, కాయిన్ సెక్యూర్, కాయిన్ డెల్టా

    మరో కరెన్సీ బయ్ యూకాయిన్. అతుల్యా భట్, దేవేష్ అగర్వాల్, శివం ధక్రాల్ కలిసి దీన్ని 2016లో ప్రారంభించారు. ఇది బిట్ కాయిన్, ఎథీరియం, లైట్ కాయిన్, బిట్ కాయిన్ క్యాష్, మనేరో, జడ్ క్యాష్, ఫ్యాక్టమ్ లిస్క్, రిపుల్ కరెన్సీలను మార్పిడి చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది. 24 గంటల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలున్న ఈ క్రిప్టో కరెన్సీ ఎలాంటి అదనపు ఛార్జీల్లేకుండా సేవలందిస్తోంది. మరో క్రిప్టో కరెన్సీ సంస్ధ కాయిన్ సెక్యూర్. బెన్సన్ శ్యామ్యూల్, మోహిత్ కల్రా అనే వ్యక్తులు దీన్ని 2014లో ఢిల్లీలో ప్రారంభించారు. ఇది బిట్ కాయిన్ ను అంగీకరిస్తుంది. దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నాలుగు రోజులు పడుతుంది. 0.3 శాతం ఛార్జీలు విధిస్తోంది. మరో క్రిప్టో కరెన్సీ కాయిన్ డెల్టా 2017లో పూనేలో ప్రారంభమైంది. రాజ్ దీప్ సింగ్, శుభం యాదవ్, మనీష్ భాగస్వాములుగా ధీన్ని ప్రారంభించారు. ఇది బిట్ కాయిన్, బిట్ కాయిన్ క్యాష్, ఎథీరియం, రిపుల్ కరెన్సీలను అంగీకరిస్తోంది. 0.3 శాతం ట్రాన్సాక్షన్ ఫీజుగా తీసుకుంటూ అప్పటికప్పుడే రిజిస్టర్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది.

     కాయిన్ స్విచ్, ఫ్లిట్ పే,

    కాయిన్ స్విచ్, ఫ్లిట్ పే,

    2017లో బెంగళూరులో ప్రారంభమైన కాయిన్ స్విచ్ కంపెనీ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఆశిష్ సింఘాల్, గోవింద్ సోనీ, విమల్ సాగర్ తివారీ దీన్ని ప్రారంభించారు. ఇది కూడా బిట్ కాయిన్, బిట్ కాయిన్ క్యాష్, ఎథీరియం, లైట్ కాయిన్, రిపుల్ కరెన్సీలను వాడుతోంది. యూజర్లు చేసే నగదు మార్పిడి లావాదేవీలకు అనుగుణంగా ఇది ఛార్జీలు వసూలు చేస్తోంది. దీన్ని కూడా వెంటనే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదే కోవలోకి వచ్చే మరో కంపెనీ ఫ్లిట్ పే. 2017లో జైపూర్ లో ఆశిష్ సంగాయ్, ఆకాష్ బన్సల్ కలిసి ప్రారంభించారు. ఇది బిట్ కాయిన్ ను అంగీకరిస్తుంది. దీనికి రిజిస్టర్ చేసుకోవాలంటే 24 గంటలు పడుతుంది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా సేవలు అందిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+