లేడీ టీచర్‌తో సహజీవనం చేసి 30 లక్షలతో పరార్

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్‌లో ఓ వ్యక్తి ఓ మహిళా టీచర్‌తో సహజీవనం చేసి 30 లక్షల రూపాయలతో ఉడాయించాడు. ఈ మేరకు 42 ఏళ్ల మహిళా టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు ఆశిష్ మోడీ ఫోర్జరీ సంతకాలతో తన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేశాడని నవరంగ్‌పురకు చెందిన ఆర్తి సాంధారియా ఆరోపించింది.

ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆర్తి ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఆరేళ్ల క్రితం కారు డిలర్‌షీప్ వద్ద ఆమెకు సరేంద్రనగర్‌కు చెందిన ఆశిష్ పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు తరుచుగా కలుకుంటూ వచ్చారు. 12 ఏళ్ల క్రితం తాను భార్యకు దూరమయ్యాయని ఆశిష్ చెప్పాడు. తాను కూడా భర్తకు దూరమైనట్లు ఆర్తి చెప్పింది.

Live-in partner cheats woman of Rs 30 lakh

తనతో సహజీవనానికి ఆర్తి ఆహ్వానించగా ఆశిష్ అంగీకరించాడు. వీరి మధ్య సంబంధం కొన్నేళ్ల పాటు సక్రమంగానే జరిగింది. గత ఏప్రిల్‌లో ఆశిష్ తనకు తెలియకుండా డబ్బులు డ్రా చేసినట్లు ఆర్తి గుర్తించింది. ఎటిఎం కార్డుల ద్వారా డబ్బులు కాజేయడంతో పాటు ఎస్‌బిఐ, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ ఖాతాల నుంచి పది లక్షల రూపాయలు డ్రా చేసినట్లు తెలుసుకుంది.

క్రెడిట్ కార్డు ఉపయోగించి మరో 8 లక్షలు అతను వాడుకున్నట్లు ఆర్తి చెబుతోంది. ఈ విషయంపై ఆమె ఆశిష్‌ను నిలదీసింది. దీంతో తాను తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఆమెకు దూరంగా వెళ్లిపోయాడు. ఫోన్ చేసినా పలికేవాడు కాదు. నాలుగేళఅల క్రితం వ్యాపారం కోసని 9 లక్షల రూపాయలు, ఏడాది క్రితం మరో నాలుగులక్షల రూపాయలు ఆమె ఆశిష్‌కు అప్పుగా ఇచ్చినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 42-year-old woman has accused her live-in partner of cheating her of Rs 30 lakh. Aarti Samdhariya, a resident of Sandipani-1in Navrangpura, has also alleged that the accused Ashish Modi also forged her signatures to withdraw money from her bank account.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి