నేరం కాదు: స్త్రీపురుషుల సంబంధంపై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: స్తీపురుష సంబంధాల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది. పెళ్లి కాకుండానే స్త్రీ, పురుషులు శారీరక సంబంధం కలిగి ఉండవచ్చునని ఆదేశాలిచ్చింది. అయితే, సహజీవనం వల్ల పుట్టే పిల్లల విషయంలో మాత్రం న్యాయస్థానం తీవ్ర ఆందోళన చెందింది. ఇలాంటి సంబంధాల వల్ల పిల్లలకు చట్టబద్దమైన రక్షణలు ఉండవని, అలాగే మహిళలకు అసలు రక్షణే లేకుండా పోతుందని హెచ్చరించింది.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చట్టాలను తీసుకువచ్చేలా చూడాలని గట్టిగా సూచించింది. స్త్రీపురుషులు సహజీవనం చేయడం నేరం గానీ, అపరాధం గానీ కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే, వివాహమైన వ్యక్తితో సహజీవనం చేసే మహిళకు చట్టపరమైన రక్షణలు ఉండవని చెప్పింది.

సహజీవనానికి సంబంధించి వివాహ సంబంధాల స్వభావాన్ని సంతరించి పెట్టడానికి, గృహ హింస చట్టం కింద మహిళలకు రక్షణ కల్పించడానికి చట్టానికి తేవాల్సిన సవరణలపై జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.
ఈ దేశంలో సమాజం అంగీకరించకపోయినప్పటికీ స్త్రీపురుషులు పెళ్లి కాకుండా సహజీనం చేయడం నేరం గానీ, అపరాధం గానీ కాదని సుప్రీంకోర్టు చెప్పింది. పెళ్లి చేసుకోవాలా, వద్దా అనేది పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పింది. ఇటువంటి సంబంధాలను వివిధ దేశాలు గుర్తిస్తున్నాయని కూడా చెప్పింది.
స్తీపురుషుల మధ్య సహజీవనం తెగిపోయి, విడిపోయినప్పుడు మహిళకు రక్షణ లేకుండా పోతుందని, ఇందుకు చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని చెప్పింది. వివాహమైన వ్యక్తితో మహిళ లైంగిక సంబంధాలు పెట్టుకున్నప్పుడు అది భార్యాభర్తల మధ్య సంబంధం కిందికి రాదని సుప్రీంకోర్టు తెలిపింది.












Click it and Unblock the Notifications