Backlash: అద్వానీ, జోషీలకు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు విశ్వ హిందూ పరిషత్(VHP) ఆహ్వానించింది. రామ మందిర నిర్మాణం కోసం ఎంతో కృషి చేసిన అద్వానీ, జోషీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని మొదట ఆలయ ట్రస్ట్ తెలిపిన విషయం తెలిసిందే. వారి వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా ఈ వేడుకకు రావొద్దని వారిని అభ్యర్థించినట్లు రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. ఇందుకు వారితోపాటు కుటుంబసభ్యులు కూడా అంగీకరించారని తెలిపారు.

అయితే, రామ మందిర ఆలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ తాజాగా అద్వానీ, జోషీలను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చినట్లు విశ్వ హిందూ పరిషత్ సభ్యుడు అలోక్ కుమార్ తెలిపారు. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఎనలేని కృషి చేసిన ఎల్కే అద్వానా, జోషీలను రావద్దని కోరడం పట్ల అసంతృప్తి వెల్లువెత్తింది. దీంతో వారిని ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని కోరినట్లు తెలుస్తోంది.

LK Advani, Joshi Invited To Attend Ayodhya Ram Temple Event After Backlash

కాగా, జనవరి 22వ తేదీన జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయనకు ఆహ్వానం కూడా అందజేశారు ఆలయ నిర్వాహకులు. జనవరి 15వ తేదీలోపు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని, ఆ మరుసటి రోజే ప్రాణ ప్రతిష్ఠ పూజ మొదలై.. జనవరి 22వ తేదీ వరకు కొనసాగుతాయని చంపత్ రాయ్ తెలిపారు.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి దేశ వ్యాప్తంగా హిందూ సంఘాల ప్రతినిధులు, ఆలయాల పూజారులు, మఠాధిపతులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందించారు. వీరితోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులు లక్షలాది సంఖ్యలో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+