Bank: హాయ్ రాజేష్, ఎలా ఉన్నావు ?, బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టాడు, పుట్టలో నుంచి బయటకు లాగిన ఈడీ !

ఐటీ హబ్ లో ఎప్పుడు ఎలా ఎవరిని ఎవరు మోసం చేస్తారో చెప్పడం చాలా కష్టం. బ్యాంకులో కోట్లలో రుణం తీసుకుని చేతులు ఎత్తేశాడు. ఈడీ అధికారులు పుట్టలో దాక్కొన్న ఆ వ్యక్తిని బయటకు ఈడ్చేశారు.

బెంగళూరు/న్యూఢిల్లీ: ఐటీ హబ్ లో ఎప్పుడు ఎలా ఎవరిని ఎవరు మోసం చేస్తారో చెప్పడం చాలా కష్టం. ఇక విజయ్ మాల్యా లాంటి మహానుభావులు బెంగళూరులో వ్యాపారాలు చేశారు. వేల కోట్ల రూపాయలు బ్యాంకులో రుణం తీసుకున్న విజయ్ మాల్యా సార్ హ్యాపీగా విమానంలో విదేశాలకు పారిపోయాడు. బెంగళూరులో వ్యాపారాలు చెయ్యడానికి లక్షలాది మంది బ్యాంకుల్లో రుణం తీసుకుంటున్నారు. అయితే నీతినిజాయితీగా అంతే మంది బ్యాంకులో తీసుకున్న రుణాలకు అసలుతో సహ వడ్డీ చెల్లిస్తున్నారు. ఓ ప్రభుద్దుడు ఓ బ్యాంకులో భారీ మొత్తంలో రుణం తీసుకుని చేతులు ఎత్తేశాడు. మ్యాటర్ తెలుసుకున్న ఈడీ అధికారులు పుట్టలో దాక్కొన్న ఆ వ్యక్తిని బయటకు ఈడ్చేశారు.

బెంగళూరులో కో ఆపరేటివ్ బ్యాంక్

బెంగళూరులో కో ఆపరేటివ్ బ్యాంక్

బెంగళూరులో శ్రీ గురురాఘవేంద్ర కోఆపరేటివ్ బ్యాంక్‌ అక్రమాస్తుల కేసులో, భారీ మొత్తం రుణం తీసుకున్న కేసులో వీఆర్ రాజేష్‌ అలియాస్ రాజేష్ అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ముందు నిందితుడు రాజేష్ ను హాజరుపరిచిన ఈడీ అధికారులు తదుపరి విచారణ కోసం అతన్ని మూడు రోజుల పాటు ఈడీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు.

జస్ట్ రూ. 40 కోట్లు అంతే

జస్ట్ రూ. 40 కోట్లు అంతే

అరెస్టయిన నిందితుడు రాజేష్ రూ.40 కోట్లుకు పైగా బ్యాంకులో నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేదని ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ బ్యాంకులో ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకున్నవారి జాబితాలో రాజేష్ ముందు వరుసలో ఉన్నాడని అధికారులు అంటున్నారు. విచారణలో ఈ విషయం వెలుగులోకి రావడంతో ఈడీ అధికారులు నిందితుడు రాజేష్ ను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక కోర్టులో నిందితుడు రాజేష్ ను హాజరుపరిచి తదుపరి విచారణ నిమిత్తం మా కస్టడీకి ఇవ్వాలని మనవి చేశారు.

ఈడీ అధికారుల కస్టడీలో రాజేష్

ఈడీ అధికారుల కస్టడీలో రాజేష్

ఈడి అధికారుల విజ్ఞప్తిని అంగీకరించిన కోర్టు తదుపరి విచారణ కోసం మూడు రోజుల పాటు రాజేష్ ను ఈడీ అధికారుల కస్టడీకి అప్పగించింది. ఈడీ అధికారుల విచారణలో రాజేష్, అతని భార్యపై పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలు ఎఫ్ఐఆర్‌లు నమోదైన విషయం వెలుగు చూసింది. శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు మాత్రమే కాకుండా ఇతర సహకార బ్యాంకులను రాజేష్ మోసం చేశాడని వెలుగులోకి వచ్చింది. భార్య పేరు మీద కూడా రాజేష్ భారీ మొత్తంలో రుణాలు తీసుకుంటున్నాడని, ఆ రుణం బ్యాంకులకు తిరిగి చెల్లించలేదని విచారణలో తేలిందని ఈడీ అధికారులు తెలిపారు.

బ్యాంకు అధికారులు ?

బ్యాంకు అధికారులు ?

మార్కెట్ రేటుకు అనుగుణంగా కాకుండా అధిక వడ్డీ రేటును డిపాజిటర్లకు అందిస్తామని బ్యాంక్ ప్రచారం చేసిందని వెలుగు చూసింది. దీని ద్వారా డిపాజిటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. బ్యాంకు అధికారులు కల్పిత రుణ ఖాతాలను సృష్టించారని వెలుగు చూసింది. ఇప్పటికే రాజేష్ కు చెందిన రూ. 5.32 కోట్లను ఆస్తిని స్వాధీనం చేసుకు్నారు. రాజేష్ చరాస్తులు, స్థిరాస్తులు జప్తు చెయ్యడానికి ఈడీ అధికారులు రంగం సిద్దం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+