వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాహీన్​బాగ్​లో మరోసారి బుల్డోజర్లు - ఉద్రిక్తత : సుప్రీం కీలక సూచన..!!

|
Google Oneindia TeluguNews

దిల్లీలోని షాహీన్​బాగ్​లో మరోసారి బుల్డోజర్లు ప్రవేశించటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానికులు ఆందోళనకు దిగారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమంలో భాగంగా బుల్డోజర్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో కూల్చివేత అడ్డుకోవాలంటూ సుప్రీంలో పిటీషన్ దాఖలు అయింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు దీని పైన హైకోర్టులో పిటీషన దాఖలు చేయాలని సూచించింది. అక్రమ కట్టడాల తొలగింపు కార్యక్రమంలో భాగంగా ఎస్​డీఎంసీ అధికారులు బుల్డోజర్​లతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ బీజేపీ పాలిస్తోంది. అక్కడ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు రంగం సిద్దం చేసారు. అయితే, బుల్డోజర్లు అక్కడకు చేరుకోగానే స్థానికులు స్థానిక మున్సిపల్ కార్పోరేషన్.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. కూల్చివేతలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసారు. ఆప్​ ఎమ్మెల్యే అమనుతుల్లా ఖాన్​ స్థానికుల తో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ప్రజలు అక్రమ నిర్మాణాలను తొలగించారని ఆయన చెప్పుకొచ్చారు. వాజుఖానా, మూత్రశాలలు గతంలోనే పోలీసుల సమక్షంలోనే తొలగించామని చెప్పారు. ఇప్పుడు ఎలాంటి అక్రమాలు లేకపోయినా...బుల్డోజర్లతో రావటం ఏంటని ప్రశ్నించారు.

Locals continue to protest at Delhi Shaheen Bagh amid the anti-encroachment drive ,AAP MLA joins stir

ఇది రాజకీయం కాదా అంటూ నిలదీసారు. దీంతో..పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. 2019, డిసెంబర్​లో జరిగిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. ఇక, దీని పైన సుప్రీంలో పిటీషన్ దాఖలైంది. కానీ, సుప్రీం ఈ వ్యవహారం పైన ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయాలని సూచించింది. స్థానిక బాధితులు హైకోర్టును ఆశ్రయించటం ద్వారా అక్కడ విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది. ఇక, అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు తమ సిబ్బంది బుల్డోజర్లతో అక్కడకు చేరుకున్నట్లుగా దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఛైర్మన్ రాజ్ పాల్ సింగ్ స్పష్టం చేసారు.

English summary
Bulldozers today rolled into Delhi's Shaheen Bagh, the heart of citizenship law protests, lead to tension and protsts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X