మిస్టరీనే: సముద్రంలో రూ.వెయ్యి నోట్లు కొట్టుకొచ్చాయి
ముంబై: డబ్బులు చెట్లకు కాయవు.. అది మనం సాధారణంగా కొట్టే డైలాగ్! అయితే, అలా కాకపోయినప్పటికీ ముంబైలో కరెన్సీ నోట్లు కొట్టుకు వచ్చాయి. కట్టల కొద్ది వెయ్యి రూపాయల నోట్లు సముద్రపు నీళ్లలో తేలుతూ కనిపించాయి.
ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర మంగళవారం సాయంత్రం ఇది జరిగింది. అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికీ తెలియదు. కానీ, వెయ్యి నోట్ల కట్టలు మాత్రం సముద్రంలో తేలుతూ కనిపించాయి.

క్షణాల్లో ఈ వార్త తెలిసి దగ్గరలో ఉండే మత్స్యకారులు, కొంతమంది ఈతగాళ్లు, దగ్గరలో ఉండే స్థానికులు కొందరు ఆ వెయ్యి రూపాయల నోట్లను ఏరుకున్నారు. అయితే, అంతలోనే నీటి ఉధృతికి ఎక్కువైంది. దీంతో చేసేదేం లేక ఊరుకుండిపోయారు. కొంతమంది వీటిని తమ సెల్ ఫోన్లో వీడియో తీశారు.
పోలీసులు అక్కడకు చేరుకొని జనాన్ని చెదరగొట్టారు. ఎవరైనా ధనవంతుడు దొంగల భారి నుంచి కాపాడుకునేందుకు లక్షలాది రూపాయల సంచిని నీళ్లలోకి విసిరేసి ఉంటాడని భావిస్తున్నారు. అయితే, అదే నిజం కాకపోవచ్చు. ఇదే కేవలం ప్రచారం మాత్రమే.












Click it and Unblock the Notifications