Lockdown: అల్లుడి కోసం కూతురి విరహవేదన: నలుగురి కోసం విమానం బుక్ చేసిన తండ్రి, ఖర్చు ?

భోపాల్/న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ అమలు కావడంతో భర్తకు భార్య దూరం అయ్యింది. పుట్టింటికి వచ్చిన భార్య, పిల్లలు అక్కడే ఉండిపోవడంతో భర్త దిగులు చెందుతాడని ఆమె ఆవేదన చెందింది. వీరి సినిమా కష్టాలు చూసి తట్టుకోలేని తండ్రి రూ. 20 లక్షలకు పైగా ఖర్చు చేసి విమానం బుక్ చేసి కేవలం నలుగురిని వారి గమ్యస్థానానికి పంపించాడు. నలుగురిలో వారి సొంత పనిమనిషి కూడా ఉంది. 180 మంది ప్రయాణించే విమానంలో కేవలం తన కుటుంబ సభ్యులు ముగ్గురు, ఒక పనిమనిషఇ వెళ్లడానికి విమానం బుక్ చేసిన లిక్కర్ వ్యాపారి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు.

భోపాల్ లో బిగ్ షాట్

భోపాల్ లో బిగ్ షాట్

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్ వ్యాపారి నివాసం ఉంటున్నాడు. ఈ వ్యాపారవేత్త కుమార్తెను ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తకు ఇచ్చి వివాహం చేశారు. వ్యాపారవేత్త కుమార్తెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో ఢిల్లీలో ఉన్న కుమార్తె తల్లిదండ్రులను చూడటానికి ఇద్దరు పిల్లలు, సొంత పనులు చూసుకునే పనిమనిషితో కలిసి భోపాల్ వెళ్లింది.

నువ్వక్కడ నేనిక్కడ

నువ్వక్కడ నేనిక్కడ

భోపాల్ లోని తండ్రికి వచ్చిన కుమార్తె అక్కడే ఉన్న సమయంలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. లాక్ డౌన్ అమలు కావడంతో విమాన సర్వీసులతో పాటు రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఢిల్లీలో భర్త ఉండిపోవడం, పిల్లలతో కలిసి భార్య పుట్టింటిలో ఉండిపోవడం జరిగింది.

కూతురు, అల్లుడి సినిమా కష్టాలు చూడలేక !

కూతురు, అల్లుడి సినిమా కష్టాలు చూడలేక !

కుమార్తె పుట్టింటికి రావడంతో ఢిల్లీలో అల్లుడు ఒంటరిగా ఉన్నాడని భోపాల్ వ్యాపారవేత్త కొన్ని రోజులు విచారంతో ఉన్నాడు. అయితే భర్తను వదిలి ఉండలేక కూతురు కష్టాలు పడుతోందని తండ్రి గమనించాడు. భర్తకు దూరంగా ఉంటున్న కుమార్తె విరహవేదన చూడలేక ఆ వ్యాపారవేత్త తనకు ఎన్ని కష్టాలు వచ్చాయో ? అంటూ ఆయన సన్నిహితుల దగ్గర వాపోయాడు.

నలుగురి కోసం విమానం బుక్ చేశాడు !

నలుగురి కోసం విమానం బుక్ చేశాడు !

కుమార్తె, ఆమె ఇద్దరు పిల్లలు, వారి సొంత పనిమనిషిని భోపాల్ నుంచి ఢిల్లీ పంపించడానికి ఆ వ్యాపారవేత్త ఏ 320 విమానం బుక్ చేశాడు. ఈ విమానంలో 180 మంది ప్రయాణించడానికి అవకాశం ఉంది. అయితే కరోనా వైరస్ భయంతో తన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ వ్యాపారవేత్త నలుగురి కోసం విమానం మొత్తం బుక్ చేసుకున్నాడు.

విమానం ఖర్చు రూ. 20 లక్షలు

విమానం ఖర్చు రూ. 20 లక్షలు

వ్యాపారవేత్త కుమార్తె, ఇద్దరు పిల్లలు, వారి పనిపనిషి భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్లడానికి దాదాపు రూ. 20 లక్షలు ఖర్చు చేసి 180 మంది ప్రయాణించడానికి అవకాశం ఉన్న విమానం బుక్ చేశాడు. భోపాల్ లోని రాజభోజ్ విమానాశ్రయం నుంచి నలుగురు ప్రయాణికులతో ఆ విమానం బయలుదేరి ఢిల్లీ చేరుకుంది. నలుగురి కోసం ఒక విమానం భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్లడానికి అధికారులు ఏర్పాట్లు చేశారని తెలుసుకున్న ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త ఆయన దగ్గర పని చేస్తున్న 10 మందిని వారి సొంత ప్రాంతాలకు పంపించడానికి విమానం టిక్కెట్లు బుక్ చేసిన విషయం మరువక ముందే ఓ లిక్కర్ వ్యాపారి నలుగురి కోసం విమానం మొత్తం బుక్ చేశారని వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+