అబ్ కీ బార్ 400కు పైగా: లోకసభ ఎన్నికలకు బీజేపీ సరికొత్త నినాదం
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సరికొత్త నినాదంతో ముందుకు వెళ్తోంది. 2014 ఎన్నికల్లో మూడు వందలకు పైగా సీట్లు నినాదంతో వెళ్లింది. ఇప్పుడు 'ఈసారి 400 పైగా' అనే నినాదంతో ముందుకు వెళ్లనుంది. ఈ మేరకు ఆ పార్టీ తమ కొత్త నినాదాన్ని విడుదల చేసింది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. 280కి పైగా సీట్లు గెలుచుకుంది. ఆయా రాష్ట్రాల్లో పలు పార్టీలతో కలిసి ఎన్డీయేగా ఏర్పడి పోటీ చేసింది. కానీ బీజేపీకి ఒక్క పార్టీకే మెజార్టీ కంటే పది సీట్లు ఎక్కువే వచ్చాయి. మొత్తం ఎన్డీయే కూటమి 330కి పైగా సీట్లు సాధించింది.

కాంగ్రెస్ పార్టీ దారుణంగా పడిపోయింది. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే 80 స్థానాలకు గాను 73 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి అక్కడ బీజేపీకి దెబ్బపడేలా ఉంది. అయితే ఈశాన్య రాష్ట్రాలు తదితర చోట్ల బీజేపీకి అనుకూలంగా ఉంది. పలు ప్రీపోల్ సర్వేలు గతంలో కంటే బీజేపీకి తక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఈసారి 400 కంటే పైన అనే నినాదంతో వెళ్తుండటం గమనార్హం.
బీజేపీకి దక్షిణాదిన అంతగా పట్టు లేదు. అలాంటప్పుడు 400కు పైగా సీట్లు అంటే కష్టమేనని అంటున్నారు. బీజేపీ మాత్రం తమకు గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సరికొత్త నినాదంతో ముందుకు సాగుతోంది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications