సీఎం కుర్చి కోసం రూ. 50 కోట్లు పెట్టుబడి, ఇద్దరు మంత్రుల హల్ చల్, బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ !
హెబ్బళి/బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చి కోసం ఆశ పడుతున్న మంత్రులు డీకే. శివకుమార్, ఎంబీ. పాటిల్ శాసన సభ ఉప ఎన్నికల్లో వారి పార్టీ అభ్యర్థులు గెలుపొందడం కోసం ఒక్కొక్కరు రూ. 50 కోట్లు ఖర్చు పెడుతున్నారని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య ఆరోపించారు.
ముఖ్యమంత్రి కావాలనే ఆశతోనే ఇద్దరు మంత్రులు కుందగోళ, చించోళి శాసన సభ నియోజక వర్గం ఇన్ చార్జ్ లుగా పని చేస్తూ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య ఇద్దరు మంత్రుల మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

కుందగోళ్ శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో డబ్బు పంపణి చెయ్యడానికి మంత్రి డీకే. శివకుమార్ బెంగళూరు నుంచి 500 మంది అనుచరులను పిలిపించారని బీజేఎమ్మెల్యే రేణుకాచార్య ఆరోపించారు. కుందగోళ్ ఉప ఎన్నికల ప్రచారం భాద్యతలు తీసుకున్న మంత్రి డీకే. శివకుమార్ అభివృద్ది గురించి ఏమీ మాట్లాడటం లేదని రేణుకాచార్య ఆరోపించారు.
మూడు సంవత్సరాల క్రితం మంత్రి డీకే. శివకుమార్ హరకుణి ప్రాంతంలో నిరంతర జ్యోతి పథకంకు శంకుస్థాపన చేశారని, ఈ రోజు ఆ ప్రాంతంలో వెలుగు లేకుండా పోయిందని రేణుకాచార్య ఆరోపించారు. డీకే. శివకుమార్ లాంటి అవినీతి మంత్రిని తాను ఇంత వరకూ చాడలేదని బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య మండిపడ్డారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications