యూపీలో కాస్తా తగ్గినా.. భారీగా బలపడ్డ ఎన్డీయే.. ఆయా సంస్థల ఎగ్జిట్ పోల్స్

ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ కూడా ముగిసింది. దేశవ్యాప్తంగా 542 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఆ క్రమంలో ఎగ్జిట్ పోల్స్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఆసక్తి సహజమే అయినప్పటికీ.. గతంలో కొన్నిసార్లు వాటికి విరుద్ధంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భాలున్నాయి.

Lok Sabha Elections: Exit Poll Results 2019 Live Updates

May 19, 2019, 9:41 pm IST

ఏబీపీ సర్వే : ఏపీలో 25 సీట్లకు గాను వైసీపీకి 20.. టీడీపీకి 5 సీట్లు.
May 19, 2019, 9:41 pm IST

ఏబీపీ సర్వే : 20 స్థానాలున్న కేరళలో కాంగ్రెస్ 16, ఇతరులు 4 సీట్లు గెలుచుకుంటారు.
May 19, 2019, 9:38 pm IST

ఏబీపీ సర్వే : కర్నాటకలో బీజేపీ పరిస్థితి మెరుగుపడింది. 28సీట్లకు గాను బీజేపీ 15, కాంగ్రెస్ మిత్రపక్షాలు 13 స్థానాల్లో గెలుపొందుతాయి.
May 19, 2019, 9:38 pm IST

దక్షిణాదిన బీజేపీ 27, కాంగ్రెస్ 53, ఇతరులు 48సీట్లు గెలుచుకుంటారని ఏబీపీ అంచనా వేసింది.
May 19, 2019, 9:34 pm IST

ఉత్తరాదిలో బీజేపీ సత్తా.. దక్షిణాదిలో మాత్రం చతికిలపడినట్లు ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ సారాంశం.
May 19, 2019, 9:32 pm IST

న్యూస్ 24-టుడేస్ చాణక్య : యూపీ, బెంగాల్‌లో బీజేపీకి భారీ మెజారిటీ.. మహాకూటమికి పరాభవం
May 19, 2019, 9:20 pm IST

2014లో న్యూస్ 24-టుడేస్ చాణక్య చెప్పిందే నిజమైంది. బీజేపీ అధికారంలోకి వచ్చింది.
May 19, 2019, 9:19 pm IST

ఎగ్జిట్ పోల్స్‌ అన్నింటిలోనూ ఎన్డీయేకు అత్యధిక స్థానాలు వస్తాయని ప్రకటించిన న్యూస్ 24-టుడేస్ చాణక్య.
May 19, 2019, 9:18 pm IST

న్యూస్ 24-టుడేస్ చాణక్య : ఎన్డీయే : 350 ± 14, యూపీఎ : 95 ± 9, ఇతరులు : 97 ± 11
May 19, 2019, 9:16 pm IST

బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తాయని ప్రకటించిన న్యూస్ 24-టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్.
May 19, 2019, 8:59 pm IST

న్యూస్ 24-టుడేస్ చాణక్య : బీజేపీదే హవా.. మహారాష్ట్ర‌లో 48 స్థానాల్లో 38 సీట్ల‌ు, బీహార్‌లో 40 స్థానాలకు 32, జార్ఖండ్‌లో 14 సెగ్మెంట్లకు 10 స్థానాలు.
May 19, 2019, 8:55 pm IST

హిందీ ప్రాబ‌ల్యం ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్‌స్వీప్.. ద‌క్షిణాదిలో కొంత ఎదురుగాలి.. మిగిలిన రాష్ట్రాల్లో తిరుగులేని మెజారిటీ.
May 19, 2019, 8:55 pm IST

న్యూస్ 24-టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ప్రకారం దేశ‌వ్యాప్తంగా మ‌రోసారి బీజేపీ హవా.
May 19, 2019, 8:54 pm IST

న్యూస్ 24-టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకే జై కొట్టిన మ‌రాఠాలు, బిహారీలు, జార్ఖండ్‌ వాసులు.
May 19, 2019, 8:53 pm IST

టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం యూపీలో ఎన్డీఏకు గట్టి దెబ్బ కొట్టనున్న మహాఘట్ బంధన్
May 19, 2019, 8:36 pm IST

ఏబీపీ, వీడీపీఏ సంస్థల అంచనా ప్రకారం టీఆర్ఎస్‌కు 16, ఎంఐఎంకు 01 స్థానం రానున్నట్లు ప్రకటించాయి.
May 19, 2019, 8:35 pm IST

తెలంగాణ లోక్‌సభ స్థానాలకు విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో కేసీఆర్ మార్క్ కనిపించింది.
May 19, 2019, 8:17 pm IST

ఇండియా టుడే సర్వే ప్రకారం రాజస్థాన్‌లో 25 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 0-2, బీజేపీ 23-25 స్థానాల్లో గెలిచే ఛాన్సున్నట్లు ప్రకటించింది.
May 19, 2019, 8:17 pm IST

ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లు కనిపిస్తోంది.
May 19, 2019, 8:09 pm IST

ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మాల్సిన అవసరం లేదంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ.
May 19, 2019, 8:07 pm IST

NEWS 18 - IPSOS : తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్‌కు 12-14, కాంగ్రెస్ 1-2, బీజేపీ 1-2, ఎంఐఎం -01
May 19, 2019, 8:05 pm IST

కర్ణాటకలో బీజేపీదే హవా అంటున్న ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్.
May 19, 2019, 8:04 pm IST

తమిళనాడులో డీఎంకే కూటమిదే పైచేయి అంటున్న ఎగ్జిట్ పోల్స్.
May 19, 2019, 8:04 pm IST

సువర్ణ న్యూస్ 24/7.. ఎన్డీయే : 295-315, యూపీఎ : 122-125, ఇతరులు : 102-125
May 19, 2019, 7:55 pm IST

నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కానున్నారనే విషయం వెల్లడిస్తున్న పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్.
May 19, 2019, 7:54 pm IST

ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెనుకబడ్డ యూపీఏ కూటమి
May 19, 2019, 7:54 pm IST

వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల ప్రకారం ఎన్డీయేదే హవా.
May 19, 2019, 7:52 pm IST

టుడేస్ చాణక్య : ఎన్డీయే - 340, యూపీఏ - 70, ఇతరులు - 132
May 19, 2019, 7:48 pm IST

ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టిన రిపబ్లిక్ టీవి ఎగ్జిట్ పోల్స్.
May 19, 2019, 7:45 pm IST

టుడేస్ చాణ‌క్య : బీజేపీ గెలుచుకునే స్థానాలు.. న్యూఢిల్లీ-7, గుజ‌రాత్‌-26, హ‌ర్యానా-10, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌-11
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+