వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈసి విభజన: ఎన్నికలు టిలో, సీమాంధ్రలో వేర్వేరుగా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lok Sabha poll dates announced, voting to begin on April 7
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ విఎస్ సంపత్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. లోకసభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. విభజన అధికారికంగా జరగలేదు. అయితే ఎన్నికలు మాత్రం తెలంగాణ, సీమాంధ్రల్లో వేర్వేరు తేదీలలో జరుగుతున్నాయి. అపాయింటెడ్ తేదీ జూన్ 2న ఉండనుంది.

మొత్తం తొమ్మిది విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 30న ఏడో విడత, మే 7న ఎనిమిదో విడత జరగనున్నాయి. ఏడో విడతలో తెలంగాణ ప్రాంతంలో, ఎనిమిది విడతలో సీమాంధ్ర ప్రాంతంలో ఎన్నికలు జరగనున్నాయి. మే 16న ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల ఉంటుంది.

తెలంగాణలో ఎన్నికల కోసం ఏప్రిల్ 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 9 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 10న నామినేషన్ల పరిశీలన. 12న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఏప్రిల్ 30న ఎన్నికలు ఉంటాయి.

సీమాంధ్రలో ఎన్నికల కోసం ఏప్రిల్ 12వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 19. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 21న. ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 23. మే 7న ఎన్నికలు ఉంటాయి.

తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంటు స్థానాలు, సీమాంధ్రలో 25 లోకసభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

English summary
Chief election Commissioner VS Sampath will announce the Lok Sabha election dates at a press conference on Wednesday morning in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X