Mahua Moitra : లోక్ సభలో ప్రశ్నకు నోటు వ్యవహారం- టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు సమన్లు...
లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రాకు ఎథిక్స్ కమిటీ ఇవాళ విచారణకు హాజరు కావాలని సమన్లు పంపింది. ఈ నెల 31న విచారణకు హాజరు కావాలని కమిటీ మొయిత్రాకు పంపిన సమన్లలో పేర్కొంది. దీంతో ఆమె విచారణకు హాజరై తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన ఫిర్యాదు ఆధారంగా లోక్ సభ ఎథిక్స్ కమిటీ ఈ విచారణ జరుపుతోంది.
లాయర్ జై ఆనంద్ డెహడ్రాయ్ షేర్ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తాను భారత్ లోనే ఉండి దుబాయ్ లో తన లోక్ సభ లాగిన్ ను షేర్ చేశారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్.. ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి పంపారు. ఎథిక్స్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న బీజేపీ ఎంపీ వినోద్ సోంకర్.. ఇవాళ నిశికాంత్ దూబేతో పాటు లాయర్ జై ఆనంద్ డెహడ్రాయ్ ని విచారణకు పిలిపించి వాంగ్మూలాల్ని నమోదు చేశారు. అనంతరం మొయిత్రాకు సమన్లు పంపారు.

లోక్ సభ ఎథిక్స్ కమిటీకి బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఉన్న ఆరోపమణలకు సంబంధించిన ఆధారాల్ని కూడా సమర్పించారు. అనంతరం విచారణ జరిపిన ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్.. దీనిపై మరిన్ని వివరాలు కోరుతూ హోంశాఖ, ఐటీ శాఖలకు లేఖలు రాస్తామన్నారు. అదే సమయంలో మొయిత్రాను అక్టోబర్ 31న విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
మహువా మొయిత్రా ఇండియాలో ఉండగా.. ఆమె పార్లమెంట్ ఐడీతో దుబాయ్ లో లోక్ సభ వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యారని నిశికాంత్ దూబే ఆరోపిస్తున్నారు. ఇందుకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ ఎన్ఐసీ దర్యాప్తు సంస్ధలకు షేర్ చేసిన వివరాల్ని ఆధారాలుగా చూపుతున్నారు. ఆరోపణలు నిజమైతే ఎథిక్స్ కమిటీ మహువా మొయిత్రా సభ్యత్వం రద్దుకు సిఫార్సు చేసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications