ఆమెకు డజను మందికి పైగానే మొగుళ్లు.. ఉండేది గంట మాత్రమే!
పెళ్లి అంటే ప్రతి ఒక్కరికి జీవితాంతం గుర్తుండిపోయే వేడు.. జీవితకాల ప్రయాణానికి తొలి అడుగు. మూడూ ముళ్లు ఏడడుగులతో ఇద్దరు ఒక్కటయ్యే అద్భుతమైన సందర్భం. కానీ ఓ మహిళ నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నట్లుగా పెళ్లిళ్ల పేరుతో ముందుకు సాగుతూనే ఉంది. రాణి కుమారి అనే ఓ మహిళ పెళ్లి పేరుతో డజనుకు పైగా పురుషుల జీవితాలను నాశనం చేసింది. పెళ్లైన కొన్ని గంటలకే నూతన వధువుగా.. వధువుగా వెళ్లాల్సిన సమయంలో దోపిడి దొంగలా మారి అందినకాడికి నగదు, ఆభరణాలు దోచుకుని అక్కడి నుంచి మాయమవుతుంది. ఎట్టకేలకు ఈ దోపిడీ దొంగ పెళ్లి కూతురికి, ఆమెకు సహకరించిన భర్త, తల్లితో సహా మొత్తం గ్యాంగ్‌ను సోన్‌భద్ర పోలీసులు అరెస్ట్ చేసి ఈ మోసాల పరంపరకు అడ్డుకట్ట వేశారు.
కొన్ని గంటల్లోనే మాయమయ్యే 'రాణి కుమారి' మోసాలు
వారణాసి కేంద్రంగా పనిచేసిన ఈ గ్యాంగ్ పెళ్లిళ్లు చేసుకోని లేదా ఇబ్బందుల్లో ఉన్న పురుషులను లక్ష్యంగా చేసుకుంది. రాణి కుమారి అలియాస్ 'లూటేరీ దుల్హన్' డజనుకు పైగా పెళ్లిళ్లు చేసుకుంది. ప్రతి వివాహం ఆమెకు కొన్ని గంటలు లేదా గరిష్టంగా ఒక రోజు మాత్రమే ఉండేది. పెళ్లైన వెంటనే లేదా కొన్ని గంటల తర్వాత, ఆమె ఇంట్లో ఉన్న నగదు, విలువైన వస్తువులతో ఎవరికీ అనుమానం రాకుండా పారిపోయేది. ఈ మోసాల వెనుక రాణి కుమారితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, ఇతర సభ్యులతో కూడిన ఒక వ్యవస్థీకృత గ్యాంగ్ పనిచేసేది. వీరు అమాయక కుటుంబాలను నకిలీ వివాహాల ద్వారా వలలో వేసేవారు.

నగదు, నగలు స్వాధీనం.. గ్యాంగ్ అరెస్ట్
సోన్‌భద్ర పోలీసులు పక్కా సమాచారంతో ఈ గ్యాంగ్‌ను ఛేదించారు. సోన్‌భద్ర ఎస్పీ అభిషేక్ వర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 6-7 తేదీల్లో పోలీసులు చేపట్టిన కఠిన చర్యలలో రాణి కుమారితో పాటు ఆమె భర్త రవి రంజన్ మౌర్య, ఈ మోసాలకు పూర్తి సహకారం అందించిన ఆమె తల్లి మాయాలను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి దొంగిలించబడిన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.9,500 నగదు, బంగారం, వెండి ఆభరణాలు, అలాగే పెళ్లికి సంబంధించిన దుస్తులు ఉన్నాయి.
యూపీ-జార్ఖండ్ సరిహద్దులో కీలక పాత్రధారి అరెస్ట్
అరెస్టు చేయబడిన ప్రధాన నిందితుల విచారణలో ఈ గ్యాంగ్‌లో పాలుపంచుకున్న మరికొందరి పేర్లు బయటపడ్డాయి. ప్రధాన నిందితుల సమాచారం ఆధారంగా పోలీసులు ఒక రోజు తరువాత గ్యాంగ్‌లో కీలక సభ్యుడైన కృష్ణానంద్ మౌర్యను అదుపులోకి తీసుకున్నారు. మ్యోర్‌పూర్ ఎస్ఓ కమల్ నయన్ దూబే అందించిన సమాచారం మేరకు.. అధికారులు కృష్ణానంద్‌ను ఉత్తరప్రదేశ్-జార్ఖండ్ సరిహద్దులో చుట్టుముట్టారు.అతని వద్ద నుంచి భారీగా రూ.90,000 నగదు, ఈ మోసాలకు ఉపయోగించిన ఒక ఎస్‌యూవీ (SUV) వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణానంద్ మౌర్య ఈ గ్యాంగ్‌లో కీలకంగా వ్యవహరించాడని, అమాయక కుటుంబాల నుంచి మోసపూరిత వివాహాల ద్వారా డబ్బు, విలువైన వస్తువులను లాగడంలో చురుకైన పాత్ర పోషించాడని అధికారులు ధ్రువీకరించారు. ఈ గ్యాంగ్ నకిలీ వివాహాలను ఒక దందాగా మార్చి, అనేక మందిని మోసగించింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications