రెండుసార్లు గర్భవతిని చేసి.. ఆపైన చేసుకోను పొమ్మన్నాడు..
ప్రేమ పేరుతో యువతిని గర్భవతిని చేసి మోసగించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి చివరికి కటకటాలపాలయ్యాడు.
తమిళనాడు: ప్రేమ పేరుతో యువతిని గర్భవతిని చేసి మోసగించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి చివరికి కటకటాలపాలయ్యాడు. తమిళనాడులోని సేలం జిల్లా పెరమచూర్ కు చెందిన కుమరేశన్(30) అనే యువకుడు విద్యుత్ బోర్డు కార్యాలయంలో అసిస్టెంట్ టెక్నీషియన్ గా
పని చేస్తున్నాడు.
తొలసంపట్టికి చెందిన శశికళ(23) అనే యువతి కుమరేశన్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం కాలేజీలో చదువుతున్న సమయంలో కుమరేశన్ బంధువు కుమార్తె ద్వారా శశికళ అతడికి పరిచయం అయింది.

వివాహం చేసుకుంటానని నమ్మించి అతడు శశికళను లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో అమె రెండుసార్లు గర్భవతి కాగా, కుమరేశన్ అబార్షన్ చేయించాడు. ఇదే సమయంలో తన ఉద్యోగం పర్మినెంట్ కావడంతో శశికళను వదిలించుకోవాలనే ఉద్దేశంతో నిదానంగా ఆమెతో మాట్లాడడం తగ్గించేశాడు.
అతడు వివాహం చేసుకునేందుకు సంబంధాలు చూస్తున్నాడని, మరో యువతిని చేసుకోబోతున్నాడనే సమాచారం తెలియడంతో తనను మోసగించాడని అర్థమైన శశికళ గత్యంతరం లేక స్థానిక మహిళా పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కుమరేశన్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.












Click it and Unblock the Notifications