Love Jihad: ప్రియురాలిని ఆంధ్రాకు పిలుచుకుని వెళ్లి ఏం చేశాడంటే ?, మతమార్పిడి !

బెంగళూరు: ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. ఇద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. ప్రియురాలు హిందువు, ప్రియుడు ముస్లీం. ప్రేమికులు హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. ముస్లీం అబ్బాయితో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అంటూ కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. సాయంత్రం అంగడికి వెళ్లిన ప్రియురాలు తరువాత ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. అమ్మాయి కనపడటం లేదని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పక్క రాష్ట్రంలో ఉన్న ప్రేమికులను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని దర్గాలో అమ్మాయితో ఆమె ప్రియుడు బలవంతంగా మతమార్పిడి చేయించాడని, అమ్మాయి పేరు మార్చాడని, లవ్ జీహాద్ తో తన కూతురు జీవితం నాశనం అయ్యిందని అమ్మాయి తల్లి ఐటీ హబ్ లో కేసు పెట్టింది.

 ముగ్గురు కూతుర్లు

ముగ్గురు కూతుర్లు

బెంగళూరు నగరంలోని యశవంతపురంలోని బీకే నగర్ లో ఉత్తరప్రదేశ్ కు చెందిన దంపతులు నివాసం ఉంటున్నారు. 15 సంవత్సరాల నుంచి ఈ దంపతులు ఇదే ఏరియాలోనే నివాసం ఉంటున్నారు. దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మూడో కుమార్తెకు 18 సంవత్సరాలు, 10వ తరగతి వరకు చదివిన అమ్మాయి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నది.

 హిందూ అమ్మాయి, ముస్లీం అబ్బాయి

హిందూ అమ్మాయి, ముస్లీం అబ్బాయి

యశవంతపురంలోని బీకే నగర్ ఏరియాలోనే సయ్యద్ మోయిన్ అలియాస్ సయ్యద్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే సమయంలో ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న యువతికి, సయ్యద్ కు రెండు సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. సయ్యద్ పరిచయం ఆ యువతితో ప్రేమకు దారితీసింది.

 ప్రియురాలికి వార్నింగ్

ప్రియురాలికి వార్నింగ్

ప్రేమికులు హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. ముస్లీం అబ్బాయి సయ్యద్ తో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, వాడు జులాయిగా తిరుగుతున్నాడని, చెడు అలవాట్లు చాలా ఉన్నాయని అమ్మాయిని ఆమె కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు.

 ప్రియుడితో లేచిపోయిన ప్రియురాలు

ప్రియుడితో లేచిపోయిన ప్రియురాలు

ఈనెల 5వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో అంగడికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పిన హిందూ యువతి తరువాత ఆమె ప్రియుడు సయ్యద్ తో కలిసి బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ కు పారిపోయింది. రాత్రి వరకు అమ్మాయి కోసం చూసిన కుటుంబ సభ్యులు తరువాత ఆమె కనపడటం లేదని, సయ్యద్ మీద అనుమానం ఉందని యశవంతపురం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

 ఆంధ్రాలో మతమార్పిడి.... లవ్ జీహాద్

ఆంధ్రాలో మతమార్పిడి.... లవ్ జీహాద్

అమ్మాయి కనపడటం లేదని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో పోలీసులు గాలించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రియురాలితో ఉన్న సయ్యద్ ను బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని దర్గాలో అమ్మాయితో ఆమె ప్రియుడు సయ్యద్ బలవంతంగా మతమార్పిడి చేయించాడని, అమ్మాయి పేరు మార్చాడని, లవ్ జీహాద్ తో తన కూతురు జీవితం నాశనం అయ్యిందని అమ్మాయి తల్లి యశవంతపురం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. పోలీసులు సయ్యద్ ను అరెస్టు చేసిన పోలీసులు అతను అమ్మాయితో బలవంతంగా మతమార్పిడి చేయించాడా అని విచారణ చేస్తున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+