Love marriage: రాత్రి ఇంట్లో భర్త తల నరికి చంపిన భార్య, స్పాట్ లేపేసింది, ఏం జరిగిదంటే ?
చెన్నై/కాంచీపురం: హిందూ అమ్మాయిని ప్రేమించిన ముస్లీం యువకుడు పెళ్లి కాకముందే ప్రియురాలితో సంతోషంగా తిరిగాడు. హిందూ మతం మార్చుకున్న యువతి ఇస్లాం మతం స్వీకరించి ప్రియుడిని పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. కరోనా వైరస్ కారణంగా సంపాధించడానికి మార్గాలు మూసుకుపోవడంతో భర్త మద్యంకు బానిస అయ్యాడు. ఓ విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇంట్లో దంపతుల మద్య మాటామాటా పెరిగిపోయింది. రాత్రి ఇంట్లో కొడవలి తీసుకున్న భార్య భర్త తల నరికి అతన్ని స్పాట్ లో చంపేసి నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య చంపడానికి వేరే కారణాలు ఉన్నాయని వెలుగు చూడటంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ తీస్తున్నారు.

హిందూ అమ్మాయి..... ముస్లీం ప్రియుడు
తమిళనాడులోని కాంచీపురంలోని గ్రేటర్ కాంచీపురంలో నౌషాద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కాంచీపురంలోనే రేవతి అనే యువతి నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం రేవతి, నౌషాద్ ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరుకావడంతో నౌషాద్ తో పెళ్లి చెయ్యడానికి రేవతి కుటుంబ సభ్యులు నిరాకరించారు.

మతం మార్చుకున్న ప్రియురాలు
కుటుంబ సభ్యులను ఎదింరించి ప్రేమించిన వ్యక్తి నౌషాద్ ను వివాహం చేసుకున్న రేవతి తరువాత హిందూ మతం మార్చుకుని ఇస్లాం మతం స్వీకరించిన రేవతి ఆమె పేరును రేష్మాగా మార్చుకుంది. నౌషాద్, రేష్మా దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నాడు. నౌషాద్ అతని భార్య రేష్మాతో కలిసి సంతోషంగా జీవించేశాడు.

కరోనా దెబ్బతో కష్టాలు
నౌషాద్ సొంతంగా ఆటో తీసుకుని కాంచీపురం, చెన్నైలో తిప్పుతూ డబ్బు సంపాధించేవాడు. ఆటో నడుపుతూ సంపాధిస్తున్న డబ్బుతో నౌషాద్ అతని భార్య రేష్మా, ఇద్దరు పిల్లలను పోషించేవాడు. కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో ఆటో బాడుగలు చిక్కకపోవడంతో నౌషాదకు ఆధాయం పూర్తిగా తగ్గిపోయింది.

అప్పులు చేసి మద్యం తాగిన భర్త
ఆధాయం లేకపోవడంతో చాలిచాలని సంపాధనతో నౌషాద్ అప్పులు చేశాడు. ఇదే సమయంలో మద్యంకు బానిస అయిన నౌషాద్ రోజు ఇంటికి వెళ్లి ఓ విషయంలో భార్య రేష్మాతో గొడవలు చెయ్యడం మొదలు పెట్టాడు. ఇటీవల కాలంలో నౌషాద్, రేష్మా దంపతుల మధ్య గొడువలు ఎక్కువ కావడంతో స్థానికులు సర్దిచెబుతూ వచ్చారు.

భర్త తల నరికి స్పాట్ లో చంపేసిన భార్య
రాత్రి నౌషాద్ మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. రాత్రి ఇంట్లో రేష్మా, నౌషాద్ మద్య గొడవ చాలా పెద్దది అయ్యింది. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన రేష్మా పదునైన కొడవలి తీసుకుని భర్త నౌషాద్ తలను కసక్ కసక్ అని నరికేసింది. మెడ మీద కొడవలితో దాడి చెయ్యడంతో నౌషాద్ స్పాట్ లో ప్రాణాలు వదిలేశాడు.

లొంగిపోయిన భార్య
భర్త నౌషాద్ ను హత్య చేసిన అతని భార్య రేష్మా ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేరుగా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయింది. మద్యం సేవించి గొడవ చేసినందుకు తన భర్తను చంపేశానని రేష్మా పోలీసులకు చెప్పింది. నౌషాద్ చాలా కాలం నుంచి మద్యం సేవిస్తున్నాడని, హత్యకు దారితీసే అంత పెద్ద గొడవ ఏమీ జరగలేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అసలు ఏం జరిగింది ?
నౌషాద్ ను ఆమె భర్త రేష్మా తల నరికి చంపడానికి వేరే కారణాలు ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేష్మా ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుందా ? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. భార్య రేష్మా ఆమె భర్తను తల నరికి స్పాట్ లో చంపేయడంతో కాంచీపురం ప్రజలు ఉలిక్కిపడ్డారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications