Lover: ప్రియురాలికి అక్రమ సంబంధం, రివర్స్ లో బ్లాక్ మెయిల్, పైకి పంపించిన ప్రియుడు !
ముంబాయి/ చెన్నై: ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తూ కాలం గడిపిన మహిళకు డబ్బు మీద ఆశ ఎక్కువ అయ్యింది. ప్రియుడికి తెలీకుండా ఆమె వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకునింది. ఇంతకాలం తనతో ఎంజాయ్ చేసి తన దగ్గర డబ్బులు లాక్కొని ఎంజాయ్ చెయ్యడమే కాకుండా ఇప్పుడు నీకు వేరే మగాళ్లు కావాలా ? అంటూ ప్రియుడు గొడవపెట్టుకున్నాడు. మర్యాదగా నీ పని నువ్వు చేసుకో, లేదంటే మనం రాసలీలలు సాగించే సమయంలో రహస్యంగా తీసిన వీడియోలు బయటపెడుతానని, నువ్వు నన్ను రేప్ చేశావని పోలీసు కేసు పెట్టి నిన్ను జైలుకు పంపిస్తానని ప్రియురాలు ఆమె బాయ్ ఫ్రెండ్ ను బ్లాక్ మెయిల్ చేసింది. నా ప్రియురాలు బతికుంటే ఎప్పటికైనా నన్ను జైలుకు పంపిస్తుందనే భయంతో ప్రియురాలని ఆమె ప్రియుడు పక్కా స్కెచ్ తో చంపేశాడు. 65 సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు చివరికి ప్రియుడిని అరెస్టు చేశారు.

ప్రైవేట్ పార్ట్ మీద దాడి చేసి హత్య
వివాహిత మహిళ గొంతు కోసేశారు. తరువాత ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో కూడా కత్తితో దాడి చేసిన నిందితులు ఆమెను చంపేశారు. ఆమె శవాన్నిముంబాయిలోని బంద్రాలోని ఎమ్ టీఎన్ ఎల్ కాంప్లెక్స్ జంక్షన్ సమీపంలోని కుర్లా కాంప్లెక్స్ దగ్గర ఉన్న డ్రైనేజ్ పక్కన విసిరేసి చాకచక్యంగా తప్పించుకుని పరారైనారు.

సెక్స్ వర్కర్ అని అనుమానం
మరుసటి రోజు ఉదయం డ్రైనేజ్ లో మహిళ శవాన్ని గుర్తించిన స్థానికులు బీకేసీ పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యకు గురైయ్యింది సెక్స్ వర్కర్ అని మొదట పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హత్యకు గురైన మహిళను కొందరు వారి కోరికలు తీర్చుకోవడానికి బుక్ చేసుకుని పిలుచుకుని వెళ్లారని తెలిసిందని బీకేసీ పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ పోలీసు అధికారి అన్నారు.

65 సీసీటీవీ కెమెరాలు
కుర్లా కంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. మొత్తం 65 సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులకు జలీల్ ఖాన్ అనే వ్యక్తి అనేక సీసీటీవీ కెమెరాల్లో చిక్కాడు. వెంటనే జలీల్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. మహిళను హత్య చేసింది నేనే అని జలీల్ ఖాన్ విచారణలో అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు.

నా డబ్బుతో ఎంజాయ్ చేసింది
స్వప్నా తనతో కలిసి ఇంతకాలం ఎంజాయ్ చేస్తూ కాలం గడిపిందని జలీల్ ఖాన్ పోలీసుకు చెప్పాడు. స్వప్నకు డబ్బు మీద ఆశ ఎక్కువ అయ్యిందని, తనకు తెలీకుండా ఆమె వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకునిందని జలీల్ ఖాన్ ఆరోపించాడు.. ఇంతకాలం తన దగ్గర డబ్బులు లాక్కొని ఎంజాయ్ చేసిందని అన్నాడు. నా డబ్బుతో తిరుగుతున్న నీకు వేరే మగాళ్లు కావాలా ? అంటూ తాను స్వప్నాతో గొడవపెట్టుకున్నానని జలీల్ ఖాన్ పోలీసులకు చెప్పాడు.
Recommended Video

బ్లాక్ మెయిల్ చేసింది. కోపంతో చంపేశాను
మర్యాదగా నీ పని నువ్వు చేసుకో, లేదంటే మనం రాసలీలలు సాగించే సమయంలో రహస్యంగా తీసిన వీడియోలు బయటపెడుతానని, నువ్వు నన్ను రేప్ చేశావని పోలీసు కేసు పెట్టి నిన్ను జైలుకు పంపిస్తానని స్వప్నా తనను బ్లాక్ మెయిల్ చేసిందని, ఆమె బతికుంటే ఎప్పటికైనా నన్ను జైలుకు పంపిస్తుందనే భయంతో ప్రియురాలని తనే చంపేశానని జలీల్ ఖాన్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. మొత్తం మీద స్వప్నాను దారుణంగా హత్య చేసిన జలీల్ ఖాన్ చిక్కడంతో కేసు విచారణ చేస్తున్న పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications