వేరే వ్యక్తితో పెళ్లి: ప్రియుడితో కలిసి యువతి ఆత్మహత్య

బెంగళూరు: జీవితంపై విరక్తి చెందిన ప్రేమికులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు నగర శివార్లలో జరిగింది. అనేకల్ లోని జనతా కాలనీలో నివాసం ఉంటున్న భరత్ (22), నందిని (21) ఆత్మహత్య చేసుకున్నారని బెంగళూరు నగర సిటి రైల్వే పోలీసులు తెలిపారు.

భరత్, నందిని గత ఐదు సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కులాలు వేరు. వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి వారి పెద్దలు నిరాకరించారు. విషయం పెద్దది అవుతుందని భావించిన నందిని కుటుంబ సభ్యులు వేరే సంబంధం చూశారు.

Lovers committed suicide near Anekal in Bangalore

ఇదే సంవత్సరం మేలో శివన్న అనే వ్యక్తితో నందిని వివాహం జరిపించారు. శివన్న ఒక దేవాలయంలో అర్చకుడిగా పని చేస్తున్నాడు. నెల రోజుల నుండి భర్త ఇంటిలో ఉన్న నందిని ఆషాణ మాసం అని పుట్టింటికి వచ్చింది. ఆదివారం భరత్ నందిని ఆనేకల్ సమీపంలో కలుసుకున్నారు.

తాను వేరే వ్యక్తితో కాపురం చెయ్యలేనని నందిని భరత్ కు చెప్పంది. ఇద్దరు కొన్ని గంటల పాటు చర్చించుకున్నారు. తరువాత ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరు నుండి సేలం వెలుతున్న రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+