కాలేజ్ లో లవర్స్, సినిమా స్టైల్లో నో, ఫ్యామిలీ, వేరే వ్యక్తితో పెళ్లి, రెండు రోజుల ముందు డ్యాంలో !

మైసూరు/బెంగళూరు: కులాంతర వివాహం చేసుకోవడానికి పెద్దలు నిరాకరించడం, సినిమా స్టైల్లో ఆ ఫ్యామిలీ వారి అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం చెయ్యడంతో జీవితంపై విరక్తిచెందిన ప్రేమికులు పెళ్లికి రెండు రోజుల ముందు జలాశయం (డ్యాం)లోకి దూకి జలసమాధి అయ్యారు. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకోవడం ఇష్టంలేని ప్రేమికులు మీ పంతాలు, పట్టింపులను మేము ఎదిరించలేమని, అలాగని మనసు చంపుకుని వేరే వ్యక్తులను వివాహం చేసుకుని జీవించలేమని, అందుకే శాశ్వతంగా దూరం అవుతున్నామని ప్రేమికులు డెత్ నోట్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నారు.

 కాలేజ్ లో ప్రేమికులు

కాలేజ్ లో ప్రేమికులు

కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని హణసూరు సమీపంలోని కోట్టిగాళ ప్రాంతానికి చెందిన సచిన్ (24) అనే యువకుడికి, యామగుంబ గ్రామానికి చెందిన సింధు (20) అనే యువతికి రెండు సంవత్సరాల క్రితం కాలేజ్ లో చదువుకునే రోజుల్లో పరిచయం అయ్యింది. వీరి పరిచయం స్నేహంతో పాటు ప్రేమకు దారితీసింది.

 సినిమా స్టోరీ, పెద్దలు నో

సినిమా స్టోరీ, పెద్దలు నో

సచిన్, సింధుల కులాలు వేరు. అయినా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. కొన్ని నెలల క్రితం సచిన్, సింధు తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని వారి తల్లిదండ్రులకు చెప్పారు. అచ్చం సినిమా స్టైల్లో మీరు కులాంతర వివాహం చేసుకోవడానికి తాము అంగీకరించమని సచిన్, సింధు తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. అయితే పెద్దలు పెళ్లికి అంగీకరిస్తారని కొంత కాలం సచిన్, సింధు వేచి చూశారు.

వేరే యువకుడితో పెళ్లి

వేరే యువకుడితో పెళ్లి

కులాంతర వివాహం చేసుకోవడానికి మేము అంగీకరించమని. మేము చూసిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని సింధుకు ఆమె తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. ఇదే సమయంలో మైసూరు సమీపంలోని పిరియపట్టణ ప్రాంతానికి చెందిన యువకుడితో సింధు వివాహం నిశ్చయం అయ్యింది.

 ఏం చెద్దామని ఆలోచించి !

ఏం చెద్దామని ఆలోచించి !

సింధుకు వేరే యువకుడితో వివాహం చేస్తున్నారని తెలుసుకున్న సచిన్ కుమిలిపోయాడు. ప్రేమించిన యువతి దూరం అవుతుందని ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. ఈ విషయం సింధుకు చెప్పాడు. అయితే నిన్ను వదిలి నేను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనితో కలిసి జీవించలేనని, నీతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని సింధు ప్రియుడు సచిన్ కు చెప్పింది.

పెళ్లికి రెండు రోజుల ముందు !

పెళ్లికి రెండు రోజుల ముందు !

సింధు, పిరియపట్టణకు చెందిన యువకుడితో సింధు నిశ్చితార్థం ఇటీవలే జరిగింది. ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం సింధు, పిరియపట్టణ యువకుడి వివాహం చెయ్యడానికి అన్నీ ఏర్పాట్లు చేశారు. మీ పంతాలు, పట్టింపులను మేము ఎదిరించలేమని, అలాగని వేరే వ్యక్తులను పెళ్లి చేసుకుని సుఖంగా జీవించలేమని, మిమ్మల్ని ఎదిరించి పెళ్లి చేసుకునే ధైర్యం లేదని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించామని సింధు, సచిన్ ఓ డెత్ నోట్ రాసిపెట్టుకున్నారు.

ప్రేమికుల చివరి క్షణాలు

ప్రేమికుల చివరి క్షణాలు

బ్రవరి 14వ తేదీ వ్యాలెంటైన్స్ డే (ప్రేమికుల రోజు) సచిన్, సింధు బైక్ లో కేఆర్ ఎస్ డ్యాం సమీపంలోని హారంగి జలాశయం సమీపంలోకి వెళ్లారు. డ్యాం పక్కనే ఉన్న పార్క్ లో కొన్ని గంటల పాటు సచిన్, సింధు కుర్చుకుని మాట్లాడుకున్నారు. తరువాత అటవి ప్రాంతంలో కొంత సేపు సంచరించారు. అటవి ప్రాంతంలోని జలాశయం ఎడుమవైపుకు వెళ్లిన సచిన్, సింధు అదే డ్యాం బ్యాక్ వాటర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడం, తరువాత జలాశయంలో వారి మృతదేహాలు తేలడంతో ఈ విషయం వెలుగు చూసింది. కేఆర్ఎస్ గ్రామీణ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+