ఆలయంలో లవర్స్ పాడుపనులు .. స్థానికుల షాకింగ్ చర్య!!
ఆలయాలను మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం. గుడికి వెళ్లే వాళ్లు కూడా ఎంతో పవిత్రమైన మనసుతో గుడికి వెళ్తారు. ఆలయాలకు వెళ్లి ఎంతో భక్తి విశ్వాసాలతో భగవంతుని పూజిస్తూ ఉంటారు. అటువంటి గుడిలో పాడు పనులు చేస్తే భక్తులకు పట్టరాని కోపం వస్తుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహమూ లేదు.
అసలు ఇంతకీ ఈ విషయం ఎందుకు చెబుతున్నారని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఇటీవల కాలంలో నడిరోడ్డు మీదనే కాదు, ఆలయాలలో సైతం పాడు పనులు చేస్తున్న లవర్స్ పెరిగిపోయారు. తాజాగా అటువంటి ప్రేమికుల జంట ఆలయంలో అసభ్యకరమైన పనులు చేస్తూ అడ్డంగా స్థానికులకు దొరికారు.

జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్ బాద్ లో నిర్సా నయాదంగా కాళీ దేవాలయంలో ఓ ప్రేమికుల జంట అసభ్యంగా ప్రవర్తిస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. ఒకే కాలేజీలో చదువుకుంటున్న ఇద్దరు ప్రేమికులు ఆలయానికి వచ్చి చేసిన పాడు పనులు సిసిటివి ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇక ఇది చూసిన ఆలయ సంరక్షకులు, స్థానికులు వారిద్దరినీ పట్టుకుని దేహశుద్ధి చేశారు.
అంతేకాదు ఆలయాలలో ఇటువంటి పాడు పనులు చేయడానికి మీరు మనుషులేనా అంటూ నోటికొచ్చినట్టు తిట్టారు. ఆ అమ్మాయిని అయితే బండ బూతులు తిట్టి, దారుణంగా కొట్టారు. ఆ మొత్తం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరిని మోకాళ్ళపై కూర్చోబెట్టి అసభ్యకర రీతిలో దూషించారు. తప్పయిపోయిందని ఆ యువతి వేడుకున్నా వదిలిపెట్టకుండా తిట్టిపోశారు.
సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో పై పోలీసులు స్పందించారు. దీనిపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని వారు చెబుతున్నారు. అయితే ప్రేమజంటని పట్టుకోవడాన్ని, మందలించడాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. గుడిలో వారు ఆ తరహా చర్యలకు పాల్పడడాన్ని అందరూ ఖండిస్తున్నారు. కానీ ఆ యువతిని నోటికొచ్చినట్టు బూతులు తిట్టి, కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications