Lovers: రివర్స్ గేర్ వేసిన గిరిష్మా, బ్లాక్ మెయిల్ చేశాడని లేపేశాను, కోటీశ్వురుడిని పెళ్లి చేసుకోవాలని స్కెచ

తిరువనంతపురం/కొచ్చి: ప్రేమించిన ప్రియుడికి స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేసిన ప్రియురాలు గిరిష్మా పోలీసుల విచారణలో పూటకు ఓ మాట, రోజుకో మాట చెబుతోందని వెలుగు చూసింది. ప్రియుడిని హత్య చేసి కుటుంబ సభ్యులు చూపించిన కోటీశ్వరుడిని పెళ్లి చేసుకుని జీవితాంతం హ్యాపీగా ఉండాలని అనుకున్న గిరిష్మా స్కెచ్ పూర్తిగా రివర్స్ అయ్యింది. అయితే ప్రియుడి హత్య కేసు నుంచి తప్పించుకోవాలని అనుకున్న గిరిష్మా ఇన్ని రోజులు పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ కు విరుద్దంగా మరో స్టేట్ మెంట్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గిరిష్మా నిజం చెప్పిందా ?, లేక తప్పించుకోవాలని స్కెచ్ వేసిందా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

గ్రేట్ లవర్స్ అనుకున్నారు

గ్రేట్ లవర్స్ అనుకున్నారు

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని పరసలై మురియాంకరై ప్రాంతానికి చెందిన షారోన్ రాజ్ అలియాస్ షారోన్ (23) అనే యువకుడు, కేరళలోని కలియకవిలై సమీపంలోని రామవర్మన్ సిరై ప్రాంతంలో నివాసం ఉంటున్న కాలేజ్ అమ్మాయి గిరిష్మా (22) అనే అమ్మాయి ప్రేమించుకుని చాలా కాలం నుంచి సంతోషంగా తిరిగేశారు.

ప్రియురాలి స్కెచ్ తో షాక్

ప్రియురాలి స్కెచ్ తో షాక్

ప్రియురాలు గిరిష్మా ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పడంతో గత నెల 14వ తేదీన షారోన్ ఆమె ఇంటికి వెళ్లాడు. తరువాత గిరిష్మా జ్యూస్ లో విషం కలిపి ఆమె ప్రియుడు షారోన్ కు ఇచ్చింది. జ్యూస్ తాగిన షారోన్ వాంతులు చేసుకుని కడుపునోప్పితో తిరువనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స విఫలమై షారోన్ చనిపోయాడు.

ఇంట్లో చూపించిన అబ్బాయితో ?

ఇంట్లో చూపించిన అబ్బాయితో ?

షారోన్ ప్రేమ విషయం గురించి తెలుసుకున్న గిరిష్మా కుటుంబ సభ్యులు అతని తో పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. కోటీశ్వరుడైన యువకుడిని నువ్వు పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటావని, షారోన్ ను పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అవుతుందని కుటుంబ సభ్యులు గిరిష్మాకు బ్రేన్ వాష్ చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ప్రియుడికి చాలా మంచితనంతో చెప్పాను

ప్రియుడికి చాలా మంచితనంతో చెప్పాను

గతంలో షారోన్ తో తాను కలిసి తిరిగిన సమయంలో, సీక్రేట్ గా పెళ్లి చేసుకున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు షారోన్ అతని మొబైల్ ఫోన్ లో డిలీట్ చెయ్యడానికి అంగీకరించలేదని, అదే విషయంలో ఇద్దరి మద్య గొడవ జరిగిందని, షారోన్ మొండిగా వ్యవహరించాడని గిరిష్మా పోలీసులకు చెప్పింది.

చంపేస్తానని షారోన్ బెదిరించాడు

చంపేస్తానని షారోన్ బెదిరించాడు

కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నేను డిసైడ్ అయ్యి అదే విషయం ప్రియుడు షారోన్ కు చెప్పానని గిరిష్మా పోలీసులకు చెప్పింది. నన్ను కాదని నువ్వు వేరే యువకుడిని పెళ్లి చేసుకుంటే గతంలో మనం తీసుకున్న ఫోటోలు, వీడియోలు నీకు కాబోయే భర్తకు పంపిస్తానని షారోన్ బ్లాక్ మెయిల్ చేశాడని, అందుకే చంపేశానని గిరిష్మా పోలీసులకు చెప్పింది.

గంటకు ఓ మాట చెబుతున్న కిలాడీ లేడీ

గంటకు ఓ మాట చెబుతున్న కిలాడీ లేడీ

పెళ్లి విషయంలో నేను వెనకడుగు వేశానని, షారోన్ మాత్రం పెళ్లి చేసుకోవాలని తన మీద ఒత్తిడి చేశాడని, ప్రేమించిన ప్రియుడికి స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేశానని గిరిష్మా పోలీసుల విచారణలో చెప్పింది. తన ప్రియుడు షారోన్ కు తానే విషం ఇచ్చానని ఇప్పటికే జరిగిన పోలీసుల విచారణలో గిరిష్మా అంగీకరించిందని మళయాలం మీడియా చెప్పింది. అయితే ఇప్పుడు గిరిష్మా మళ్లీ మాట మార్చడంతో కేరళ పోలీసులు బిత్తరపోయారని తెలిసింది.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+