చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Marriage:ప్రియురాలి ఇంట్లో చేపల పులుసు తిని పెళ్లి కొడుకు ? అత్త చేసిందని ఆత్రంలో ?, డౌట్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ సేలం/ కొచ్చి: ప్రేమలో పడిన యువతి, యువకుడు అందరు ప్రేమికుల్లాగా ఎంజాయ్ చేశారు. ఎవరిపాటికి వాళ్లు ఉద్యోగాలు చేసుకుంటూ ఇంతకాలం ప్రేమికులుగా ఎంజాయ్ చేశారు. అయితే పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోకుండా ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని సిద్దం అయ్యారు. పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నాలుగు రోజుల్లో ఇద్దరూ పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్దం అయ్యారు. పెళ్లి చేసుకుంటున్నానని ఉత్సాహంలో ఉన్న యువకుడికి కరోనా వైరస్ లాక్ డౌన్ దెబ్బతో ఊహించని సంఘటన ఎదురైయ్యింది. ప్రియురాలి ఇంటిలో ఎంతో ఇష్టంగా అత్త చేసిన చేపల ఫ్రై, చేపల పుసులు తిన్న పెళ్లి కొడుకు ప్రాణాలు పెళ్లికి నాలుగు రోజుల ముందే గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది.

Singer: నా మొగుడికి నా దగ్గర స్టామినా తక్కువ, ఆంటీల దగ్గర భజన ఎక్కువ, కేసు పెట్టిన భార్య !Singer: నా మొగుడికి నా దగ్గర స్టామినా తక్కువ, ఆంటీల దగ్గర భజన ఎక్కువ, కేసు పెట్టిన భార్య !

 రెండు రాష్ట్రాల లవ్లీ లవర్స్

రెండు రాష్ట్రాల లవ్లీ లవర్స్

కేరళలోని ఇడుక్కికి చెందిన నిశాంత్ (30) అనే యువకుడు చెన్నై చేరుకుని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తమిళనాడులోని అరియలూరు జిల్లా పల్లికరై సమీపంలోని కోండచోలపురంకు చెందిన రాజశ్రీ సెల్వి (28) అనే యువతి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నది. నిశాంత్, రాజశ్రీకి పరిచయం అయ్యింది. వీరి పరిచయం తొందరగా ప్రేమకు దారితీసింది.

 గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పెద్దలు

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పెద్దలు

అందరూ ప్రేమికులులాగా నిశాంత్, రాజశ్రీ ఉద్యోగాలు చేసుకుంటూనే ఖాళీ సమయంలో కలిసిమెలసి తిరిగారు. ఇద్దరూ సినిమాలు, షికార్లు, పార్క్ లకు తిరిగి ఎంజాయ్ చేశారు. ఇద్దరి మనసులు కలిసిపోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే కష్టాలు ఎదురౌతాయని, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని వారివారి కుటుంబ సభ్యులకు చెప్పారు. మరుమాట మాట్లాడకుండా నిశాంత్, రాజశ్రీల పెళ్లికి ఇరుకుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

 సంతోషం పట్టలేకపోయారు

సంతోషం పట్టలేకపోయారు

ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా, ఒక్కరు కూడా నో అని చెప్పకుండా ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిశాంత్, రాజశ్రీ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అప్పటి నుంచి నిశాంత్, రాజశ్రీ భార్యభర్తలు లాగా కలిసిమెలసి తిరిగారు. మే 17వ తేది (ఈనెల) నిశాంత్, రాజశ్రీ పెళ్లి జరిపించాలని పెద్దలు డేట్ ఫిక్స్ చేశారు.

 లాక్ డౌన్ దెబ్బతో సమస్యలు

లాక్ డౌన్ దెబ్బతో సమస్యలు

తమిళనాడులో కరోనా వైరస్ తాండవం చెయ్యడంతో నిశాంత్ పని చేస్తున్న కంపెనీలో సెలవులు ప్రకటించారు. తమిళనాడులో లాక్ డౌన్ అమలలోకి వచ్చింది. ఇదే సమయంలో కేరళలో కూడా కరోనా దెబ్బకు లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. అప్పటికే ప్రియురాలు రాజశ్రీ ఆమె సొంత ఊరికి వెళ్లిపోయింది. కేరళ వెళ్లడానికి (అంతరాష్ట్ర నియమాలు) సమస్యలు రావడంతో నిశాంత్ సొంత ఊరికి వెళ్లలేక ప్రియురాలు రాజశ్రీ ఊరికి వెళ్లడానికి సిద్దం అయ్యాడు.

 కాభోయే అల్లుడు అంటూ వంటలే వంటలు

కాభోయే అల్లుడు అంటూ వంటలే వంటలు

కేరళ వెళ్లడానికి అవకాశం లేదని, నేను మీ ఊరికి వస్తానని నిశాంత్ ఆమె ప్రియురాలు రాజశ్రీకి చెప్పాడు. తమకు కాభోయే అల్లుడు పెళ్లికి నాలుగు రోజులు ముందుగానే ఊరికి వస్తున్నాడని తెలియడంతో రాజశ్రీ కుటుంబ సభ్యులు సంతోషంతో రమ్మని కారు ఏర్పాటు చేశారు. నిశాంత్ ప్రియురాలు రాజశ్రీ ఇంటికి వెళ్లాడు. కొత్త అల్లుడు వెళ్లిన సందర్బంగా మూడు రోజుల నుంచి రాజశ్రీ ఇంటిలో వెరైటీ వెరైటీ వంటలు చేస్తున్నారు.

 చేపల ఫ్రై, చేపల పులుసుతో ప్రాణం పోయింది

చేపల ఫ్రై, చేపల పులుసుతో ప్రాణం పోయింది

బుధవారం రాజశ్రీ ఇంట్లో ఆమె తల్లి చేపల ఫ్రైతో పాటు, చేపల పులుసు కూర చేశారు. చేపల ఫ్రై, చేపల పులుసు ఎంతో ఇష్టంగా తిన్న నిశాంత్ అర్దగంట లోపే వాంతులు చేసుకున్నాడు. వెంటనే నిశాంత్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై నిశాంత్ కొన్ని గంటల్లోనే ప్రాణాలు వదిలేశాడు.

 ఏం జరిగింది ?, ఎందుకు ప్రాణం పోయింది

ఏం జరిగింది ?, ఎందుకు ప్రాణం పోయింది

విషయం తెలుసుకున్న నిశాంత్ తండ్రి కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే నిశాంత్ ఎలా చనిపోయాడు అని కచ్చితంగా తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కొడుకు ప్రియురాలు ఇంట్లో చేపల పులుసు తిని ప్రాణాలు వదలడం కలకలం రేపింది. నిశాంత్ మృతిపై అతని కుటుంబ సభ్యులు, బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

English summary
lovers: The new groom who ate fish curry at the girlfriend's house has died tragically in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X