Viral Video: క్యాబ్ డ్రైవర్‌ను కొట్టిన యువతి మరో అరాచకం... ఆ ఇంటి ముందు రచ్చ రచ్చ...

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అకారణంగా ఓ క్యాబ్ డ్రైవర్‌ని ఎగిరెగిరి కొట్టిన యువతి గుర్తుంది కదా..! ప్రియదర్శిని నారాయణ్ అనే ఆ యువతికి సంబంధించి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండేళ్ల క్రితం నాటి ఆ వీడియోలో ఆ యువతి తమ కాలనీలోని ఓ ఇంటి యజమానితో గొడవ పడుతోంది.ఆ యజమాని తన ఇంటి గేటుకు నల్ల కలర్ వేయించడంపై అభ్యంతరం,ఆగ్రహం వ్యక్తం చేస్తూ అరుపులతోనే వారిని భయపెట్టేంత పనిచేసింది.

ఆ ఇంటి గేటుకు నల్ల కలర్ వేయడం ద్వారా మొత్తం కాలనీ ప్రమాదంలో పడిందని ప్రియదర్శిని నారాయణ్ పేర్కొనడం గమనార్హం. గాల్లో ఎగిరే ఇంటర్నేషనల్ డ్రోన్లను నల్ల కలర్ ఆకర్షిస్తుందని... తద్వారా కాలనీపై దాడి జరిగే అవకాశం ఉందని ఆమె వాదించింది. పోలీసులు వెంటనే ఆ నల్ల కలర్‌ను మార్పించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. లేదంటే వారి కారణంగా కాలనీ మొత్తం ప్రమాదంలో పడుతుందని పేర్కొంది.

'మీరు ఇంటికి వెళ్లండి... వారికి మేము అర్థమయ్యేలా చెబుతాం...' అంటూ పోలీసులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.అయినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. అక్కడి నుంచి కదలకుండా వారిపై అరుస్తూనే ఉంది. ఆమె మాటలకు అక్కడివారు నవ్వడం ఆ వీడియోలో గమనించవచ్చు. ప్రియదర్శిని నారాయణ్ మాటలు చాలామందికి వింతగా,ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. నిజానికి ఆ వీడియోలో ప్రియదర్శిని కూడా నల్ల రంగు దుస్తులే ధరించింది. ఆమె నల్ల రంగు దుస్తులు ధరిస్తే తప్పు లేదు కానీ ఆ ఇంటి గేటుకు నల్ల రంగు వేస్తే తప్పా అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని కొందరు... సైకో అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవల లక్నోలోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రియదర్శిని నారాయణ్ ఓ క్యాబ్ డ్రైవర్‌పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. సినిమాల్లో హీరో లెవల్‌లో రెచ్చిపోయిన ఆ అమ్మాయి అతని చెంపల్ని చెడామడా వాయించింది. కొద్దిసేపటి వరకూ ఆపకుండా అతన్ని కొడుతూనే ఉంది. ఈ క్రమంలో అతని సెల్‌ఫోన్‌ని కూడా పగలగొట్టింది. అయితే ఆమె ఎందుకంతలా రెచ్చిపోయి కొట్టిందనేది ఎవరికీ తెలియదు.ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై కూడా స్పష్టత లేదు.

 lucknow girls another shocking video shouting at neighbours

ఆమె అతన్ని కొడుతున్నంత సేపు దగ్గరికి వెళ్లడానికి కూడా చాలామంది భయపడ్డారు. ఆ క్యాబ్ డ్రైవర్ నిస్సహాయంగా దెబ్బలు తిన్నాడు తప్పితే ఎక్కడా తిరగబడలేదు. ఒకరిద్దరు ధైర్యం చేసి ఆమెను ఆపేందుకు వెళ్లగా... అందులో ఒకరిపై కూడా ఆమె దాడికి పాల్పడింది. నడిరోడ్డుపై ఆమె ఇలా దాడికి పాల్పడటంతో... వెనకాల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ వీడియో మొదట మేఘ్ అప్‌డేట్స్ అనే ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా పోస్ట్ అయింది. కనీసం కారణమేంటో చెప్పకుండా క్యాబ్ డ్రైవర్‌ని ఓ అమ్మాయి కొడుతూనే ఉందంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. లక్నోలోని,అవధ్ క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.

క్యాబ్ డ్రైవర్‌పై దాడికి పాల్పడిన ఆ యువతిని అరెస్ట్ చేయాలంటూ ట్విట్టర్‌లో నెటిజన్లు #arrestLucknowgirl పేరిట హాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేశారు.ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒకవేళ అదే యువతి స్థానంలో ఓ యువకుడు ఉండి ఉంటే ఇలాగే చూస్తూ ఊరుకునేవాళ్ల అంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్ చేశారు. పాపం ఆ క్యాబ్ డ్రైవర్‌ పరిస్థితి అంటూ వాపోయారు.ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+